Chintha Chiguru : వేసవి కాలంలో మనకు సహజంగానే మామిడి పండ్లు అధికంగా లభిస్తుంటాయి. ఎందుకంటే ఇది సీజన్ కాబట్టి, ఈ సీజన్‌లోనే మనం మామిడి పండ్లను అధికంగా తినగలం. అలాగే వాటితో చాలా మంది పచ్చడి, ఒరుగులు, తాండ్ర వంటివి చేసి నిల్వ చేస్తుంటారు. అయితే ఈ సీజన్‌లోనే మనకు లభించే వాటిల్లో చింత చిగురు కూడా ఒకటి. ఇప్పుడు మనకు రహదారుల పక్కన చింత చెట్లకు ఎక్కడ చూసినా చింత చిగురు కనిపిస్తోంది. అలాగే మార్కెట్లలో చింత చిగురును విక్రయిస్తున్నారు కూడా. ఈ క్రమంలోనే చింత చిగురుతో మనం అనేక రకాల వంటకాలను చేస్తుంటాం. చింత చిగురు పప్పు, పచ్చడితోపాటు పులిహోర, రొయ్యలు, మటన్, చికెన్ వంటివి కలిపి వండుతుంటారు. అయితే వాస్తవానికి చింత చిగురు చక్కని రుచిని అందించడమే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఈ క్రమంలో చింత చిగురును తినడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
చింత చిగురులో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఇది ఆర్థరైటిస్ ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తుంది. చింత చిగురును నేరుగా తిన్నా లేదా పేస్ట్‌లా చేసి కట్టులా కడుతున్నా కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. మోకాళ్ల నొప్పుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఇక దీన్ని తినడం వల్ల విటమిన్ లభిస్తుంది. ఇది రోగ నిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచుతుంది. దీంతో వాతావరణం మార్పుల వల్ల వచ్చే సీజనల్ వ్యాధులకు అడ్డుకట్ట వేయవచ్చు. అలాగే చింత చిగురు ఆకుల పేస్ట్‌ను రాయడం వల్ల గాయాలు, పుండ్లు త్వరగా మానుతాయి. ఇది యాంటీ సెప్టిక్‌లా పనిచేస్తుంది. అలాగే చర్మ ఇన్‌ఫెక్షన్లు కూడా తగ్గుతాయి.
దగ్గు, జలుబు, గొంతు సమస్యలకు సైతం చింత చిగురు చక్కగా పనిచేస్తుంది. ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో కొన్ని చింత చిగురు ఆకులను వేసి కాసేపు మరిగించాలి. అనంతరం చల్లార్చి గోరు వెచ్చగా ఉండగానే అందులో తేనె కలిపి తాగాలి. దీంతో దగ్గు, జలుబు, గొంతు నొప్పి తగ్గుతాయి. ఇక చింత చిగురు ఆకుల రసాన్ని సేవించడం వల్ల మహిళలకు రుతు సమయంలో వచ్చే నొప్పులు తగ్గుతాయి. ఇలా చింత చిగురు మనకు చక్కగా పనిచేస్తుంది. కనుక ఇది బయట ఎక్కడైనా కనిపిస్తే విడిచిపెట్టకుండా ఇంటికి తెచ్చుకోండి. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యాన్ని పొందవచ్చు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…