Smoke Pan : పెళ్లిళ్లు లేదా ఇతర శుభ కార్యాల విందుల్లో మనకు అనేక రకాల వంటకాలు లభిస్తుంటాయి. వెజ్, నాన్ వెజ్ ప్రియుల జిహ్వా చాపల్యానికి తగినట్లుగా అతిథులు అనేక రకాల వంటకాలను సిద్ధం చేసి ఉంచుతారు. ఈ మధ్య కాలంలో ఆర్థికంగా స్థితివంతులు చాలా మంది విందుల్లో వందలకు పైగా వెరైటీ పుడ్స్‌ను వడ్డిస్తున్నారు. అయితే అంతా బాగానే ఉంది కానీ.. వాటిల్లో ఆహారాలను తినే ముందు ఒకసారి ఆలోచించాల్సిందే. ఎందుకంటే ఓ బాలిక అలాగే వెరైటీగా ఉంటుందని ఓ స్మోక్ పాన్ తిన్నది. కానీ ఆ ఫీలింగ్ ఎక్కువ సేపు ఉండలేదు. ఆమె చిన్న పేగుకు రంధ్రం పడింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో ఓ వివాహ విందులో వందలకు పైగా వెరైటీ వంటకాలను వడ్డించారు. వాటిల్లో స్మోక్‌పాన్ కూడా ఉంది. ఈ క్రమంలోనే దానికి అట్రాక్ట్ అయిన ఓ బాలిక స్మోక్ పాన్‌ను తిన్నది. అయితే మొదట అంతా బాగానే అనిపించినా 2-3 రోజులకు ఆమెకు పొట్టలో విపరీతమైన నొప్పి వచ్చింది. దీంతో ఆమెను వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ పరీక్షలు చేసి చూడగా ఆమె చిన్న పేగుకు రంధ్రం పడిందని గుర్తించారు. ఆమె తిన్న స్మోక్ పాన్ వల్లే ఇలా జరిగిందని తేల్చారు.
ఇక విషయం తెలిసిన వైద్యులు ఆ బాలికకు శస్త్ర చికిత్స చేశారు. ఆమెకు ఇంట్రా ఆపరేషన్ ఓజీడీ స్కోపీ ద్వారా శస్త్ర చికిత్స నిర్వహించారు. ఈ క్రమంలో ఆ బాలిక కోలుకున్న తరువాత ఆమెను హాస్పిటల్ నుంచి డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం ఆ బాలిక ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. స్మోక్ పాన్ పిల్లలకు మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. అందులో నైట్రోజన్ కంటెంట్ అధికంగా ఉంటుందని, అందువల్లే ఇలా జరిగిందని వారు అంటున్నారు. కనుక ఇకపై స్మోక్ పాన్ తినే ముందు ఎవరైనా సరే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిందే. లేదంటే ఇబ్బందుల పాలు కాక తప్పదు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…