సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే టెక్ మహీంద్రా కంపెనీ మీకు సదవకాశాన్ని అందిస్తోంది. ఆ సంస్థలో ఖాళీగా ఉన్న పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. డిగ్రీ చదివి ఉండి సంబంధిత కోర్సులను చేసి ఉంటే చాలు, టెక్ మహీంద్రా కంపెనీలో జాబ్ పొందవచ్చు. ఈ పోస్టులకు ఎంపికైన వారు హైదరాబాద్ కేంద్రంగా ఉన్న టెక్ మహీంద్రా సంస్థలో పనిచేయాల్సి ఉంటుంది.
ఆసక్తి, అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చు. ఈ ఏడాది చివరి వరకు ఈ పోస్టులకు అప్లై చేసేందుకు గడువు ఉంది. అంటే ఇంకా చాలా కాలం ఉంది కనుక అభ్యర్థులు ఆయా కోర్సుల్లో శిక్షణ పొంది మరీ ఈ జాబ్‌లకు అప్లై చేయవచ్చు. ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు డిగ్రీ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా ఐబీఎం ఏనీఐ కనెక్ట్ బేసిక్ స్కిల్స్, ఈఎస్‌క్యూఎల్, ఎక్స్ఎంఎల్ వంటి కోర్సులను చేసి ఉండాలి. పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యతను ఇస్తారు. ఫ్రెషర్స్ కూడా ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.
ఇక ఈ పోస్టులకు గాను ఆన్‌లైన్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది. అందుకు గాను అభ్యర్థులు https://careers.techmahindra.com/Registration.aspx?JobId=NQAAADkAAAAzAAAANwAAADgAAAA=-k6fqRuY78iY= అనే లింక్‌ను సందర్శించవచ్చు. మరిన్ని వివరాలను కూడా అభ్యర్థులు ఇదే లింక్‌లో తెలుసుకోవచ్చు. కనుక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవ్వాలనుకుంటున్న వారికి ఇదొక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్‌లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్‌గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్‌టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…