ఉద్యోగాలు

యూకో బ్యాంకులో ఉద్యోగాలు.. జీతం నెల‌కు రూ.93వేలు..

యూకో బ్యాంక్ ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఈ మేర‌కు కోల్‌క‌తాలోని యూకో బ్యాంక్ బ్రాంచి వారు ఈ నోటిఫికేష‌న్‌ను రిలీజ్ చేశారు. బ్యాంకులో ఖాళీగా ఉన్న రెగ్యుల‌ర్ స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్ పోస్టుల‌ను ఈ నియామ‌క ప్ర‌క్రియ‌లో భాగంగా భ‌ర్తీ చేయ‌నున్నారు. మొత్తం 68 ఖాళీలు ఉన్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ పోస్టుల‌కు గాను అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఆస‌క్తి, అర్హ‌త ఉన్న వారు జ‌న‌వ‌రి 20వ తేదీ లోగా ఆన్‌లైన్‌లో అప్లై చేయ‌వచ్చు. ఈ పోస్ఉల‌కు ద‌ర‌ఖాస్తు చేయాల‌నుకునే అభ్య‌ర్థులు సీఏ, ఎఫ్ఆర్ఎం, సీఎఫ్ఏ, ఐసీఏఐ స‌ర్టిఫికేష‌న్‌, డిగ్రీ, పీజీ, బీఈ, బీటెక్ ఉత్తీర్ణ‌త‌ను క‌లిగి ఉండాలి. ప‌ని అనుభ‌వం ఉన్న‌వారికి ప్రాధాన్య‌త‌ను ఇస్తారు. అభ్య‌ర్థులు మ‌రిన్ని వివ‌రాల‌కు https://ucobank.com/job-opportunities అనే సైట్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు.

మొత్తం పోస్టులు 68 ఉండ‌గా, ఎకనామిస్ట్ (జేఎంజీఎస్‌-I) పోస్టులు : 2, ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ (జేఎంజీఎస్‌-I) పోస్టులు : 2, సెక్యూరిటీ ఆఫీసర్ (జేఎంజీఎస్‌-I) పోస్టులు : 8, రిస్క్ ఆఫీసర్ (ఎంఎంజీఎస్‌-II) పోస్టులు : 10, ఐటీ ఆఫీసర్ (ఎంఎంజీఎస్‌-II) పోస్టులు : 21, చార్టర్డ్ అకౌంటెంట్ (ఎంఎంజీఎస్‌-II) పోస్టులు : 25 ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసే అభ్య‌ర్థుల వ‌య‌స్సు 01.11.2024 నాటికి ఎక‌నామిస్ట్ పోస్టుల‌కు అయితే 21 నుంచి 30 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. అదే ఫైర్ సేఫ్టీ ఆఫీస‌ర్ పోస్టుల‌కు 22 నుంచి 35 ఏళ్ల మ‌ధ్య‌, మిలిగిన పోస్టుల‌కు 25 నుంచి 35 ఏళ్ల మ‌ధ్య వ‌య‌స్సును క‌లిగి ఉండాలి.

ఈ పోస్టుల్లో ఎంపికైన అభ్య‌ర్థుల‌కు నెల‌కు జేఎంజీఎస్‌-1 పోస్టుల‌కు అయితే రూ.48వేల నుంచి రూ.85వేల వ‌ర‌కు చెల్లిస్తారు. ఎంఎంజీఎస్ 2 పోస్టుల‌కు రూ.64 వేల నుంచి రూ.93వేల వ‌ర‌కు చెల్లిస్తారు. అప్లికేష‌న్ స్క్రీనింగ్‌, రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు ఫీజు రూ.600 కాగా ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులు రూ.100 చెల్లించాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

వరల్డ్ కప్ ఫైనల్ బ్యాట్‌ను అక్షయ్‌కు గిఫ్ట్ ఇచ్చిన అభిషేక్ శర్మ.. ఎందుకంటే?

భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…

Sunday, 15 March 2026, 10:44 PM

‘రంగీలా’ పాట చూసి ‘భూత్’ ఆఫర్ ఇచ్చా.. ఊర్మిళా మతోండ్కర్‌పై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన త‌న భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…

Sunday, 15 March 2026, 8:15 PM

ధురంధర్ 2 బాక్సాఫీస్ సునామీ.. విడుదలకు ముందే రూ.32 కోట్ల వసూళ్లు!

భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…

Sunday, 15 March 2026, 4:01 PM

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది.. పవన్ కళ్యాణ్ మాస్ జాతర! శ్రీలీలతో రొమాన్స్ అదిరింది..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…

Sunday, 15 March 2026, 3:04 PM

వింత రనౌట్ వివాదం.. పాక్ ప్లేయర్‌కు ఐసీసీ షాక్! ఆ తప్పు చేసినందుకు భారీ జరిమానా..

బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…

Saturday, 14 March 2026, 10:32 PM

2024 vs 2026.. ఏ వరల్డ్ కప్ విజయం గొప్పది? ఫ్యాన్స్ మధ్య ఆసక్తికర చర్చ!

భార‌త టీ20ఐ క్రికెట్ జ‌ట్టు టీ20 వ‌ర‌ల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావ‌స్తోంది. అయిన‌ప్ప‌టికీ…

Saturday, 14 March 2026, 8:31 PM

గ్యాస్, పెట్రోల్ కొరత రాదు.. కేంద్రం కీలక ప్రకటన! ఆ జలసంధి వద్ద టెన్షన్..

పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…

Saturday, 14 March 2026, 7:22 PM

అల్లు అర్జున్ ‘అల్లు సినిమాస్’ ప్రారంభం.. ‘వాల్ ఆఫ్ గ్రేట్స్’పై మొదలైన వివాదం!

హైదరాబాద్‌లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్‌గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…

Saturday, 14 March 2026, 5:49 PM