ఉద్యోగాలు

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. రైల్వేలో ఉద్యోగాలు.. జీతం ఎంతంటే..?

దేశ‌వ్యాప్తంగా ఉన్న ప‌లు జోన్ల‌లో ఖాళీగా ఉన్న ప‌లు పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి రైల్వే శాఖ ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఈ మేర‌కు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) గ్రూప్ డి పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. మొత్తం 32,438 పోస్టుల‌ను ఈ నియామ‌క ప్ర‌క్రియ‌లో భాగంగా భ‌ర్తీ చేయ‌నున్నారు. అభ్య‌ర్థులు ఈ పోస్టుల‌కు గాను ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు గాను ఫిబ్ర‌వ‌రి 23 వ‌ర‌కు చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు. పాయింట్స్‌మ‌న్‌, అసిస్టెంట్‌, ట్రాక్ మెయింటెయిన‌ర్‌, అసిస్టెంట్‌, అసిస్టెంట్ లోకో షెడ్‌, అసిస్టెంట్ ఆప‌రేష‌న్స్ త‌దిత‌ర పోస్టుల‌ను ఈ నియామ‌క ప్ర‌క్రియలో భాగంగా భ‌ర్తీ చేస్తారు.

అభ్య‌ర్థులు మ‌రిన్ని వివ‌రాల‌కు గాను https://indianrailways.gov.in/railwayboard/ అనే అధికారిక వెబ్ సైట్‌ను సంద‌ర్శించి స‌మాచారం తెలుసుకోవ‌చ్చు. ఈ పోస్టుల‌కు 10వ త‌ర‌గ‌తి, ఐటీఐ అర్హ‌త క‌లిగిన వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఆర్ఆర్బీకి చెందిన అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీగఢ్, చెన్నై, గోరఖ్‌పుర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్ రీజియ‌న్ల‌లో ఈ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ట్రాఫిక్, ఇంజినీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో ఈ పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తారు.

ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసే అభ్య‌ర్థులు 10వ త‌ర‌గ‌తిలో లేదా ఐటీఐ డిప్లొమా, నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ వొకేషనల్‌ ట్రైనింగ్‌ (NCVT) జారీ చేసిన నేషనల్‌ అప్రెంటిషిప్‌ సర్టిఫికెట్‌ (NAC), సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత, నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. 01.07.2025 నాటికి 18 నుంచి 36 సంవత్సరాల మధ్య వ‌య‌స్సు ఉండాలి. ఎస్సీ/ ఎస్సీ/ ఓబీసీ/ పీహెచ్‌ అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ పోస్టుల‌కు ఎంపికైన వారికి నెల‌కు ప్రారంభ వేత‌నం రూ.18వేలు చెల్లిస్తారు. కంప్యూట‌ర్ ఆధారిత ప‌రీక్ష (సీబీటీ), ఫిజిక‌ల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ), డాక్యుమెంట్ల వెరిఫికేష‌న్‌, మెడిక‌ల్ ఎగ్జామినేష‌న్ ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. ద‌ర‌ఖాస్తు ఫీజు రూ.500 చెల్లించాలి. రిజ‌ర్వ్‌డ్ కేట‌గిరిల‌కు చెందిన వారు రూ.250 చెల్లిస్తే చాలు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

వరల్డ్ కప్ ఫైనల్ బ్యాట్‌ను అక్షయ్‌కు గిఫ్ట్ ఇచ్చిన అభిషేక్ శర్మ.. ఎందుకంటే?

భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…

Sunday, 15 March 2026, 10:44 PM

‘రంగీలా’ పాట చూసి ‘భూత్’ ఆఫర్ ఇచ్చా.. ఊర్మిళా మతోండ్కర్‌పై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన త‌న భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…

Sunday, 15 March 2026, 8:15 PM

ధురంధర్ 2 బాక్సాఫీస్ సునామీ.. విడుదలకు ముందే రూ.32 కోట్ల వసూళ్లు!

భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…

Sunday, 15 March 2026, 4:01 PM

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది.. పవన్ కళ్యాణ్ మాస్ జాతర! శ్రీలీలతో రొమాన్స్ అదిరింది..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…

Sunday, 15 March 2026, 3:04 PM

వింత రనౌట్ వివాదం.. పాక్ ప్లేయర్‌కు ఐసీసీ షాక్! ఆ తప్పు చేసినందుకు భారీ జరిమానా..

బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…

Saturday, 14 March 2026, 10:32 PM

2024 vs 2026.. ఏ వరల్డ్ కప్ విజయం గొప్పది? ఫ్యాన్స్ మధ్య ఆసక్తికర చర్చ!

భార‌త టీ20ఐ క్రికెట్ జ‌ట్టు టీ20 వ‌ర‌ల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావ‌స్తోంది. అయిన‌ప్ప‌టికీ…

Saturday, 14 March 2026, 8:31 PM

గ్యాస్, పెట్రోల్ కొరత రాదు.. కేంద్రం కీలక ప్రకటన! ఆ జలసంధి వద్ద టెన్షన్..

పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…

Saturday, 14 March 2026, 7:22 PM

అల్లు అర్జున్ ‘అల్లు సినిమాస్’ ప్రారంభం.. ‘వాల్ ఆఫ్ గ్రేట్స్’పై మొదలైన వివాదం!

హైదరాబాద్‌లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్‌గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…

Saturday, 14 March 2026, 5:49 PM