హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) లో పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. మొత్తం 234 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ పోస్టులను ఈ నియామక ప్రక్రియలో భాగంగా భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు గాను అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి. దరఖాస్తులను సమర్పించేందుకు గాను ఫిబ్రవరి 14ను చివరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు మరిన్ని వివరాలకు https://www.hindustanpetroleum.com/documents/pdf/Recruitment_of_Junior_Executive_Officer_2024-25_English_15012025.pdf అనే లింక్‌ను సందర్శించి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. అలాగే https://www.hindustanpetroleum.com/ అనే లింక్‌ను సందర్శించి ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో అప్లై చేయవచ్చు.
మొత్తం 234 పోస్టులు ఉండగా వాటిల్లో.. మెకానికల్ 130, ఎలక్ట్రికల్ 65, ఇన్‌స్ట్రుమెంటేషన్ 36, కెమికల్ పోస్టులు 2 ఉన్నాయి. అన్ని విభాగాల్లోనూ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు గాను అభ్యర్థులు మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, కెమికల్ టెక్నాలజీ ఇంజినీరింగ్ విభాగాల్లో మూడేళ్ల డిప్లమా పూర్తి చేసి ఉండాలి. UR/ OBCNC/ EWS అభ్యర్థులు 65 శాతం, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 14.02.2025 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరిలకు చెందిన అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
అభ్యర్థులు రూ.1180 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. ఎంపికైన అభ్యర్థులు చేరిన తేదీ నుండి ఒక సంవత్సరం పాటు ప్రొబేషన్‌లో ఉంటారు. దానిని విజయవంతంగా పూర్తి చేసిన వారు కంపెనీ నియమాల ప్రకారం ఆఫీసర్ గా నిర్ణయించబడతారు. పే స్కేల్ రూ.30వేల నుండి రూ.1,20,000 మధ్య ఉంటుంది. ఈ పోస్టులకు గాను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), గ్రూప్ టాస్క్/ గ్రూప్ డిస్కషన్, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మాతృత్వం ఒక మహిళ జీవితంలో అత్యంత మధురమైన దశగా భావించబడుతుంది. బిడ్డకు జన్మనిచ్చిన ఆనందం ఒక వైపు ఉంటే, మరోవైపు…
మెటాకు చెందిన ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి…
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్…
భారతీయ పోస్టల్ శాఖ 2026 సంవత్సరానికి గ్రామీణ డాక్ సేవక్ (GDS) నియామకాల అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ…
జూనియర్ ఎన్టీఆర్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం దేవర: పార్ట్ 2 భవితవ్యంపై గత కొంతకాలంగా అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ…
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…