టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

January 15, 2026 9:13 PM

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఇప్ప‌టికే ప్రారంభం కాగా ఫిబ్ర‌వ‌రి 22వ తేదీ వ‌ర‌కు గ‌డువు ఉంది. ఈ నియామ‌క ప్ర‌క్రియ‌లో భాగంగా మొత్తం 32,438 లెవ‌ల్ 1 గ్రూప్ డి ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. టెన్త్ లేదా ఐటీఐ చ‌దివిన వారు ఈ పోస్టుల‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఈ క్ర‌మంలోనే సికింద్రాబాద్ సౌత్ సెంట్ర‌ల్ రైల్వే జోన్ ప‌రిధిలో 1642 ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తారు. మ‌రిన్ని వివ‌రాల‌కు అభ్య‌ర్థులు https://www.rrbapply.gov.in/#/auth/landing అనే అధికారిక వెబ్‌సైట్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు.

అహ్మ‌దాబాద్‌, అజ్మీర్‌, బెంగ‌ళూరు, భోపాల్‌, భువ‌నేశ్వ‌ర్‌, బిలాస్‌పూర్‌, చండీగ‌ఢ్‌, చెన్నై, గోర‌ఖ్‌పూర్‌, కోల్‌క‌తా, మాల్దా, ముంబై, పాట్నా, ప్ర‌యాగ్ రాజ్‌, రాంచీ, సికింద్రాబాద్ జోన్ల‌లో ఈ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. మొత్తం గ్రూప్ డి పోస్టుల సంక్య 32,438 ఉండ‌గా పాయింట్స్‌మన్‌- 5,058, అసిస్టెంట్‌ (ట్రాక్‌ మెషిన్‌)- 799, అసిస్టెంట్‌ (బ్రిడ్జ్‌)- 301, ట్రాక్ మెయింటెయినర్ గ్రూప్-4 – 13,187, అసిస్టెంట్‌ పీ-వే- 247, అసిస్టెంట్‌ (సీ అండ్‌ డబ్ల్యూ)- 2587, అసిస్టెంట్‌ లోకో షెడ్‌ (డిజిల్‌)- 420, అసిస్టెంట్‌ (వర్క్‌షాప్‌)- 3077, అసిస్టెంట్‌ (ఎస్‌ అండ్‌ టీ)- 2012, అసిస్టెంట్‌ టీఆర్‌డీ- 1381, అసిస్టెంట్‌ లోకో షెడ్‌ (ఎలక్ట్రికల్‌)- 950, అసిస్టెంట్‌ ఆపరేషన్స్‌- (ఎలక్ట్రికల్‌)- 744, అసిస్టెంట్‌ టీఎల్‌ అండ్‌ ఏసీ- 1041, అసిస్టెంట్‌ టీఎల్‌ అండ్ ఏసీ (వర్క్‌షాప్‌)- 625 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

RRB Group D Recruitment 2025 full details how to apply

ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థుల వ‌య‌స్సు 18 నుంచి 36 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. రిజ‌ర్వ్‌డ్ కేట‌గిరిల‌కు చెందిన అభ్య‌ర్థుల‌కు ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం గ‌రిష్ట వ‌యో ప‌రిమితిలో స‌డ‌లింపులు ఉంటాయి. ఈ పోస్టుల‌కు ఎంపికైన అభ్య‌ర్థుల‌కు రూ.18వేల ప్రారంభ జీతం చెల్లిస్తారు. కంప్యూట‌ర్ ఆధారిత ప‌రీక్ష‌, ఫిజిక‌ల్ ఎఫిషియెన్సీ టెస్ట్‌, ధ్రువ‌ప‌త్రాల ప‌రిశీల‌న‌, మెడిక‌ల్ ఎగ్జామినేష‌న్ ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. ద‌ర‌ఖాస్తు ఫీజు రూ.500 కాగా రిజ‌ర్వ్‌డ్ విభాగాల‌కు చెందిన వారు రూ.250 చెల్లించాలి. ఈ పోస్టుల‌కు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now