నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎన్‌సీఎల్) 2026 సంవత్సరానికి గాను అసిస్టెంట్ ఫోర్‌మన్ (ట్రెయినీ) గ్రేడ్-C నియామకాలకు అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 270 ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ పోస్టులు ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ విభాగాలకు సంబంధించినవి కాగా ఆన్‌లైన్ దరఖాస్తులు ఫిబ్రవరి 11, 2026 నుంచి ప్రారంభం అయ్యాయి. మార్చి 5, 2026 రాత్రి 11:59 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు.
అసిస్టెంట్ ఫోర్‌మన్ (ట్రెయినీ) పోస్టులకు మొత్తం 270 ఖాళీలు ఉన్నాయి. సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో గుర్తింపు పొందిన సంస్థ నుంచి 3 సంవత్సరాల డిప్లొమా తప్పనిసరి. అదనంగా అభ్యర్థులు మెట్రిక్యులేషన్ (10వ తరగతి) ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ-ఎన్‌సీఎల్, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి. అర్హతలు ఉన్న పురుషులు, మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక ప్రక్రియలో మొదట కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) నిర్వహిస్తారు. ఈ పరీక్షలో టెక్నికల్ పరిజ్ఞానం, రీజనింగ్, అవగాహన, ఆప్టిట్యూడ్ అంశాలు ఉంటాయి.
సీబీటీ ఆధారంగా షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అనంతరం వైద్య పరీక్ష నిర్వహిస్తారు. తుది ఎంపిక పూర్తిగా సీబీటీ ఫలితాలు, అర్హత ప్రమాణాల ఆధారంగా ఉంటుంది.
గమనిక: అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు NCL అధికారిక వెబ్‌సైట్ www.nclcil.in లోని పూర్తి నోటిఫికేషన్‌ను చదవాలి. అధికారిక నోటిఫికేషన్, వెబ్‌సైట్‌ను సందర్శించి సమాచారాన్ని ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది.
సోషల్ మీడియాలో ఇప్పటికే చాలా మంది సినీ సెలబ్రిటీలు భిన్న రకాల ప్లాట్‌ఫామ్‌లలో అకౌంట్లను ఓపెన్ చేసి తమ అభిమానులతో…
తల్లినయ్యాక తన జీవితాన్ని చూసే విధానమే మారిపోయిందని బాలీవుడ్ నటి కియారా అద్వానీ తెలిపింది. హీరోలకు దీటుగా యాక్షన్ సన్నివేశాల్లో…
బ్యాటింగ్‌లో పవర్ ప్లేలో ఎదురైన సమస్యలు, ప్రభావవంతం కాని బౌలింగ్ వల్లనే సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు ఐపీఎల్…
రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసి వసూళ్లలో దూసుకెళ్తోంది.…
అల్లు అర్జున్ యాక్టింగ్‌లోనే కాదు, డ్యాన్స్‌లోనూ ఎంతో ప్రావీణ్యులని అందరికీ తెలిసిందే. అయితే ఆయనకు డ్యాన్స్ నేర్పింది తానేనని సీనియర్…
ప్రస్తుతం తన ధ్యాస, దృష్టి అంతా సినిమాలపైనే ఉందని, ఇప్పట్లో వివాహం చేసుకునే ఉద్దేశం లేదని నటి సాయిపల్లవి స్పష్టం…
దేశవ్యాప్తంగా ప్రజలు శ్రీరామనవమి వేడుకలను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఎక్కడ చూసినా శ్రీసీతారాముల కల్యాణ ఉత్సవాలతో ఆధ్యాత్మిక శోభ…
సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా అన్ని చోట్లా మహిళలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అనేక చోట్ల, వృత్తి జీవితంలోనూ వారు సర్దుకుని పోవాల్సి…