---Advertisement---

India Post GDS Recruitment 2024 : త‌పాలా శాఖ‌లో 44,228 ఖాళీలు.. రాత ప‌రీక్ష లేకుండానే..!

January 15, 2026 9:13 PM
---Advertisement---

India Post GDS Recruitment 2024 : మ‌న దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో 2024-25 సంవత్సరానికి ఉద్యోగ ఖాళీల భర్తీకి గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్‌) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 44,228 పోస్టులు ఉన్న‌ట్టు తెలియ‌జేశారు. అయితే ఈ పోస్ట్ కోసం ఎలాంటి రాత పరీక్ష ఉండ‌దు. కేవలం పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఉద్యోగం పొందవచ్చు. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 5, 2024వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవ‌ల‌సి ఉంటుంది. ఇక రాష్ట్రాల వారీగా ఎన్ని ఖాళీలు ఉన్నాయ‌నేది వెబ్ సైట్‌లో పొందుప‌రిచారు. తెలుగు రాష్ట్రాల్లో భారీగానే ఖాళీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 1,355 పోస్టులు, తెలంగాణలో 981 పోస్టుల వరకు ఉన్నాయి.

పోస్టుల వివరాలు చూస్తే.. బ్రాంచ్ పోస్టు మాస్టర్‌ (బీపీఎం), అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ (ఏబీపీఎం), డాక్‌ సేవక్‌.. ఇక మొత్తం పోస్టుల సంఖ్య: 44,228. ఈ పోస్ట్ కి ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్ధులు క‌చ్చితంగా ప‌దో త‌ర‌గతిలో ఉత్తీర్ణ‌త పొంది ఉండాల్సి ఉంటుంది. వయోపరిమితి 18 నుంచి 40 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది. కంప్యూటర్‌ నాలెడ్జ్‌తోపాటు సైకిల్‌ తొక్కడం వచ్చి ఉండాల్సి ఉంటుంది.. బ్రాంచ్ పోస్టు మాస్టర్‌ (బీపీఎం) పోస్టులకు నెలకు రూ.12 వేల నుంచి రూ.29,380 వరకు జీతంగా చెల్లిస్తారు. అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ (ఏబీపీఎం), డాక్‌ సేవక్‌ పోస్టులకు నెలకు రూ.10 వేల నుంచి రూ.24,470 వరకు జీతంగా చెల్లిస్తారు.

India Post GDS Recruitment 2024 about 44228 job vacancies how to apply and details
India Post GDS Recruitment 2024

ఔత్సాహిక అభ్యర్థులు ఇండియా పోస్ట్ నుండి అప్‌డేట్‌లను పర్యవేక్షించాలి. 2024 సంవత్సరానికి జీడీఎస్ దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్‌లో https://indiapostgdsonline.gov.in/ ఈ వెబ్ సైట్ ద్వారా చేసుకోవ‌చ్చు. ఎంపిక విధానం చూస్తే.. అభ్యర్థులు పదోతరగతిలో సాధించిన మెరిట్‌లిస్ట్‌ మార్కుల ఆధారంగా మాత్ర‌మే షార్ట్‌లిస్ట్‌ చేసి ఎంపిక చేయ‌డం జ‌రుగుతుంది.. ఎంపికైన వారందరికీ ధృవీకరణ పత్రాల పరిశీలన జరిపి, పోస్టులను కేటాయిస్తారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు పైన ఇచ్చిన వెబ్ సైట్‌లో చెక్ చేసుకోవ‌చ్చు.

Bhavanam Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now