ఆరోగ్యం

Vitamin B6 : వీటిని రోజూ తింటే చాలు.. హార్ట్ ఎటాక్ రాదు.. న‌ర‌న‌రాల్లో బ‌లం పెరుగుతుంది..!

Vitamin B6 : మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే విట‌మిన్స్ లో బి కాంప్లెక్స్ విట‌మిన్స్ కూడా ఒక‌టి. శరీరాన్ని బ‌లంగా, ఉంచ‌డంలో, న‌రాల వ్య‌వ‌స్థ‌ను ఆరోగ్యంగా ఉండ‌చంలో ఇవి ఎంతో అవ‌స‌ర‌మ‌వుతాయి. నాగ‌రిక‌త పేరు చెప్పి ప్ర‌తి ఆహారాన్ని మ‌నం పాలిష్ ప‌ట్టి తీసుకోవ‌డం వ‌ల్ల ధాన్యాల పై పొర‌ల్లో ఉండే బి కాంప్లెక్స్ విట‌మిన్స్ అన్ని త‌వుడులో వెళ్లి పోతూ ఉంటాయి. క‌నుక మ‌నం తీసుకునే ఆహారాల ద్వారా బి కాంప్లెక్స్ విట‌మిన్స్ త‌క్కువ‌గా అందుతాయి. దీంతో చాలా మంది విట‌మిన్ బి 6 ( పైరాడాక్సిన్) లోపం తలెత్తుతుంది. బి 6 లోపించ‌డం వ‌ల్ల మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. అస‌లు విట‌మిన్ బి 6 వ‌ల్ల మ‌న‌కు శ‌రీరానికి క‌లిగే లాభాలు ఏమిటి… ఇది లోపించ‌డం వల్ల క‌లిగే న‌ష్టాలు ఏమిటి..మ‌న శ‌రీరానికి ఎంత మోతాతులో ఈ విట‌మిన్ అవ‌స‌ర‌మ‌వుతుంది.. ఏఏ ఆహారాల్లో ఈ విట‌మిన్ ఎక్కువ‌గా ఉంటుంది..అన్న విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఎర్ర ర‌క్త‌క‌ణాలు స‌రైన ఆకారంలో ఆరోగ్యంగా త‌యార‌వ్వ‌డానికి విట‌మిన్ బి 6 ఎంత‌గానో అవ‌స‌ర‌మవుతుంది. అలాగే మ‌నం సంతోషంగా, ఆనందంగా ఉన్న‌ప్పుడు గాబా, సెరిటోనిన్ అనే కొన్ని ర‌కాల హ్యాపీ హార్మోన్లు త‌యార‌వుతాయి. ఈ హార్మోన్లు ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అయ్యేలా చేయ‌డంలో విట‌మిన్ బి 6 మ‌న‌కు అవ‌స‌ర‌మ‌వుతుంది. విట‌మిన్ బి6 లోపించ‌డం వ‌ల్ల ఈ హ్యాపీ హార్మోన్లు త‌క్కువ‌గా ఉత్ప‌త్తి అవుతాయి. దీంతో ఒత్తిడి, ఆందోళ‌న‌, డిఫ్రెష‌న్, మూడ్ స్వింగ్స్ వంటివి పెరిగిపోతాయి. ఒత్తిడి, ఆందోళ‌న వంటివి మ‌న ద‌రి చేర‌కుండా మ‌న‌సు ప్ర‌శాంతంగా, హాయిగా ఉండాలంటే మ‌న‌కు విట‌మిన్ బి6 ఎంత‌గానో అవ‌స‌ర‌మ‌వుతుంది. అలాగే శ‌రీరంలో యాంటీ బాడీస్ ను ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అయ్యేలా చేయ‌డంలో కూడా మ‌నకు విట‌మిన్ బి 6 అవ‌స‌ర‌మవుతుంది. ఎంత ఎక్కువ‌గా యాంటీ బాడీస్ ఉత్ప‌త్తి అయితే మ‌న ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ అంత ఆరోగ్యంగా, అంత ధృడంగా ఉంటుంది.

Vitamin B6

అదే విధంగా మ‌నం తీసుకునే ఆహారాల్లో ఉండే ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయ‌డంలో కూడా విట‌మిన్ బి 6 మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. శ‌రీరంలో త‌గినంత విట‌మిన్ బి 6 ఉంటేనే ప్రోటీన్లు ఆమైనో యాసిడ్లుగా మారి మ‌న శ‌రీరానికి అందుతాయి. అలాగే మ‌నం పీల్చే గాలిలో ఉండే కాలుష్యం నుండి వైర‌స్, బ్యాక్టీరియాల నుండి గాలితిత్తులను ర‌క్షించ‌డంలో కూడా విట‌మిన్ బి 6 మ‌న‌కు అవ‌స‌ర‌మ‌వుతుంది. ఈ విదంగా విట‌మిన్ బి6 మ‌న శ‌రీరానికి ఎంతో అవ‌స‌ర‌మ‌వుతుంది. విట‌మిన్ బి 6 లోపించ‌డం వ‌ల్ల ఈ ప్ర‌యోజ‌నాల‌న్నింటిని మ‌నం కోల్పోవ‌డంతో పాటుగా అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన కూడా ప‌డాల్సి వ‌స్తుంది. ఈ విట‌మిన్ బి6 మ‌న‌కు ఒక రోజుకు 2 మిల్లీ గ్రాముల మోతాదులో అవ‌స‌ర‌మ‌వుతుంది. గ‌ర్భిణీ స్త్రీల‌కు, బాలింత‌ల‌కు 2.6 మిల్లీ గ్రాముల మోతాదులో అవ‌స‌ర‌మ‌వుతుంది. అలాగే ఈ విట‌మిన్ బి6 అనేది నీటిలో కరిగే విట‌మిన్.

ఇది మ‌న శ‌రీరంలో నిల్వ ఉండ‌దు. దీనిని మ‌నం ఏ రోజుకు ఆ రోజే శ‌రీరానికి అందించాల్సి ఉంటుంది. చిరు ధాన్యాల‌న్నింటిలోనూ విట‌మిన్ బి6 ఎక్కువ‌గా ఉంటుంది. వీటిని పాలిష్ ప‌ట్ట‌కుండా వాడుకున్న‌ప్పుడే మ‌న శ‌రీరానికి ఈ విట‌మిన్ బి6 అందుతుంది. అలాగే 100 గ్రాముల ప‌ల్లీల్లో 300 మిల్లీ గ్రాములు, రాజ్మా గింజల్లో 400 మిల్లీ గ్రాములు, సోయా చిక్కుడులో 400 మిల్లీ గ్రాములు, నువ్వుల్లో 800 మిల్లీ గ్రాములు, పొద్దు తిరుగుడు పప్పులో 1.3 మిల్లీ గ్రాములు, పిస్తా ప‌ప్పులో 1.7 మిల్లీ గ్రాముల విట‌మిన్ బి6 ఉంటుంది. ఈ విత్త‌నాల‌ను, గింజ‌ల‌ను నాన‌బెట్టి తీసుకోవ‌డం వ‌ల్ల ఇవి త్వ‌ర‌గా జీర్ణ‌మ‌వుతాయి. తెల్ల‌టి పాలిష్ ప‌ట్టిన ఆహారాల‌ను తీసుకోవ‌డం మానేసి ఇలాంటి మంచి ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో విట‌మిన్ బి 6 లోపం త‌లెత్త‌కుండా ఉంటుందని దీంతో మ‌నం ఈ విట‌మిన్ లోపించ‌డం వ‌ల్ల క‌లిగే అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా ఉంటామ‌ని నిపుణులు చెబుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

నా భ‌ర్త ఎప్పుడూ నాకు భారం అయ్యేలా ప్ర‌వ‌ర్తించ‌లేదు.. తాప్సీ ఎమోషనల్ కామెంట్స్!

త‌న వైవాహిక జీవితం ప్ర‌స్తుతం ఎంతో సంతోష‌క‌రంగా ఉంద‌ని, భ‌ర్త మ‌థియాస్ బో త‌నకు భారంగా అనిపించేలా ఎప్పుడూ ప్ర‌వ‌ర్తించ‌లేద‌ని…

Tuesday, 24 February 2026, 10:28 PM

అక్షయ్ కుమార్ చెప్పిన ఆ మాటలే నా జీవితాన్ని మార్చేశాయి: మృణాల్ ఠాకూర్

న‌టుడు అక్ష‌య్ కుమార్ గ‌తంలో త‌న‌కు చెప్పిన మాట‌లు ఎంతో ప్రేర‌ణ‌గా నిలిచాయ‌ని న‌టి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఇటీవ‌ల…

Tuesday, 24 February 2026, 9:29 PM

లడ్డూ నెయ్యి కల్తీపై అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ నిప్పులు.. బాధ్యులను వదిలేది లేదు!

తిరుమ‌ల ల‌డ్డూ క‌ల్తీ నెయ్యి ఘ‌ట‌న‌లో బాధ్యుల‌ను క‌ఠినంగా శిక్షించాల్సిందేన‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ డిప్యూటీ సీఎం ప‌వన్ క‌ల్యాణ్ అన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్…

Tuesday, 24 February 2026, 6:05 PM

ఓటమి మంచిదే.. టీమిండియాపై రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు..

టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026లో భాగంగా అహ్మ‌దాబాద్‌లో సౌతాఫ్రికాతో జ‌రిగిన సూప‌ర్ 8 మ్యాచ్‌లో భార‌త్ ఓడిపోవ‌డం మంచిదేన‌ని, త‌ప్పుల‌ను…

Tuesday, 24 February 2026, 5:30 PM

‘కల్కి 2’ సెట్స్ నుంచి ఫొటో.. అశ్వత్థామ గెటప్‌లో అమితాబ్!

నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో క‌ల్కి 2898 ఎడి సినిమాకు సీక్వెల్‌గా తెర‌కెక్కుతున్న క‌ల్కి 2 చిత్ర షూటింగ్ ఫొటోను బాలీవుడ్…

Tuesday, 24 February 2026, 3:05 PM

జగన్ అడిగితే టికెట్ నేనే కొనిస్తా.. క్రికెట్ మ్యాచ్‌పై లోకేష్ సెటైర్లు!

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భార‌త్ ఫైన‌ల్‌కు చేరితే మళ్లీ స్టేడియంకు వెళ్లి మ్యాచ్ చూస్తాన‌ని, కావాలంటే వైఎస్ జ‌గ‌న్‌కు కూడా…

Monday, 23 February 2026, 10:13 PM

ట్రోలర్లకు సమంత వార్నింగ్.. ఇక సహించేది లేదు! మే 15న మూవీ రిలీజ్..

త‌న వ్య‌క్తిగ‌త జీవితంపై ట్రోలింగ్ చేస్తూ సోష‌ల్ మీడియాలో వ్య‌తిరేక‌తను వ్యాపింప‌జేసే వారిని ఇక‌పై ఏమాత్రం స‌హించ‌బోన‌ని స‌మంత అన్నారు.…

Monday, 23 February 2026, 7:57 PM

మణిరత్నం-విజయ్ సేతుపతి మూవీలో సాయిపల్లవి.. ధనుష్ ప్లేస్‌లోకి ‘మక్కల్ సెల్వన్’!

త‌మిళ న‌టుడు విజయ్ సేతుప‌తితో ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం తెర‌కెక్కించ‌నున్న సినిమాలో న‌టి సాయిప‌ల్ల‌విని ఎంపిక చేసిన‌ట్లు తెలుస్తోంది. సాయిప‌ల్ల‌విని ఈ…

Monday, 23 February 2026, 6:21 PM