Tamarind Seeds : ఒకప్పుడు మోకాళ్ళ నొప్పులు అనేవి 50 సంవత్సరాలు దాటాక వచ్చేవి. కానీ ఇప్పుడు మారిన జీవనశైలి కారణంగా 30 సంవత్సరాలు వచ్చేసరికి మోకాళ్ళ నొప్పులు అనేవి వచ్చేస్తున్నాయి. అయితే ఈ నొప్పులను తగ్గించుకోవటానికి పెయిన్ కిల్లర్స్ వాడవలసిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పే చిట్కా నొప్పులను తగ్గించటమే కాకుండా ఎన్నో సమస్యలను తగ్గిస్తుంది. చింతపండు వాడినప్పుడు చింతగింజలను పాడేస్తూ ఉంటాం. ఆ చింత గింజలు నొప్పులను తగ్గించటానికి సహాయపడతాయి. చింత గింజలను వేయించి పొట్టు తీసి పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని ప్రతి రోజు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో అరస్పూన్ మోతాదులో కలిపి తీసుకుంటే సరిపోతుంది.
దీన్ని ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడైనా సరే తీసుకోవచ్చు. భోజనానికి 30 నిమిషాల ముందు తీసుకోవాలి. అయితే షుగర్ ఉన్నవారు మాత్రం ఉదయం, సాయంత్రం రెండు పూటలా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ పొడి నొప్పులను తగ్గించటమే కాకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. అలాగే డయాబెటిస్ ఉన్నవారిలో కూడా చాలా హెల్ప్ చేస్తుంది. అధిక బరువు, శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగిస్తుంది.
ఈ పొడిలో ఉండే డైటరీ ఫైబర్ వల్ల కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. ఇది జీర్ణ వ్యవస్థని కూడా మెరుగు పరుస్తుంది. చింత గింజల పొడితో పళ్లను తోమితే పంటి మీద గార, పసుపు రంగు తొలగి తెల్లగా మెరుస్తాయి. చింత గింజలు పాంక్రియాస్ ని ప్రొటెక్ట్ చేస్తాయి. చింత గింజల పొడి కలిపిన నీరు తాగడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ ని నాచురల్ గా మ్యానేజ్ చేయగలుగుతారు. దీంతో షుగర్ అదుపులో ఉంటుంది. షుగర్ ఉన్నవారికి ఇది ఎంతో మేలు చేస్తుంది.
చింత గింజల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాల వలన చర్మానికి వచ్చే ఇన్‌ఫెక్షన్స్ ని తగ్గించుకోవచ్చు. అంతే కాక మూత్రాశయ ఇన్ ఫెక్షన్ రాకుండా కూడా చూసుకోవచ్చు. చింత గింజలను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. చింత గింజలు, పొడి రెండూ ఆయుర్వేదం షాప్స్ లేదా ఆన్‌లైన్ స్టోర్స్ లో లభ్యం అవుతాయి. వీటిని కొనుగోలు చేసి పైన తెలిపిన విధంగా వాడవచ్చు. దీంతో ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…