---Advertisement---

Giloy Plant : ఈ మొక్క ఎక్క‌డ క‌నిపించినా స‌రే విడిచిపెట్ట‌కుండా తెచ్చుకోండి.. ఎందుకంటే..?

October 17, 2022 7:16 AM
---Advertisement---

Giloy Plant : కరోనా విజృంభించిన సమయంలో తిప్పతీగ అనే మంచి ఔషధ గుణాలు కలిగిన మొక్క ఉందని చాలామందికి తెలిసింది. అప్పటి నుంచి తిప్పతీగను ఆయుర్వేద మందుగా చాలామంది వ్యాధులు నయం చేసుకోవడం కోసం ఉపయోగించడం మొదలుపెట్టారు.  ఆయుర్వేదం ప్రకారం తిప్పతీగ ఆకులు, కాండం మరియు కొమ్మలు ఈ మూడు భాగాలు కూడా ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి. అయితే తిప్పతీగ యొక్క కాండం, కొమ్మలను వ్యాధుల చికిత్స చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. తిప్ప తీగలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అలాగే ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మరియు క్యాన్సర్ నిరోధక లక్షణాలు కూడా ఉన్నాయి.

తిప్పతీగ జ్వరం, ఎసిడిటీ, కామెర్లు, కీళ్లనొప్పులు, మధుమేహం,మలబద్ధకం,అజీర్ణం,మూత్ర సంబంధ వ్యాధులు మొదలైన వాటి నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. వాత పిత్త కఫ దోషాలను నియంత్రించడంలో మంచి మందుగా ఉపయోగపడుతుంది. ఆయుర్వేదం ప్రకారం, అజీర్ణ వ్యాధులతో పాటు, ఆస్తమా మరియు దగ్గు వంటి శ్వాసకోశ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో కూడా తిప్పతీగ చాలా ప్రయోజనకరంగా పని చేస్తుంది.

take Giloy Plant to your home whenever you see many benefits
Giloy Plant

సీజన్‌లో వచ్చే జ్వరాలు, వ్యాధులు, ఇన్‌ఫెక్షన్స్  నుంచి రక్షణ కల్పిస్తుంది. తిప్పతీగలో ఉండే యాంటీ వైరల్, యాంటీ బయోటిక్, యాంటీ ఫంగస్ గుణాలు శరీరంలో చేరే సూక్ష్మ క్రిములను నాశనం చేస్తాయి.  తిప్పతీగ ఆకుల చూర్ణంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తిప్పతీగ ఆకుల పొడిని బెల్లంలో కలుపుకుని ప్రతిరోజూ తీసుకుంటే అజీర్తి సమస్య తగ్గుతుంది. అదేవిధంగా జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు తిప్పతీగ చూర్ణాన్ని నిత్యం ఉదయం, సాయంత్రం తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్  స్థాయిలను తగ్గించుకోవచ్చు.

తిప్పతీగ పొడిని వేడి పాలలో కలుపుకుని తాగితే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. గోరు వెచ్చని పాలలో కొద్దిగా తిప్పతీగ చూర్ణం, అల్లం రసం కలిపి రోజూ రెండు పూటలా త్రాగితే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. దగ్గు,జలుబు, టాన్సిల్స్ తదితర శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు తిప్పతీగ చూర్ణాన్ని వాడితే ఫలితం ఉంటుంది. ఒత్తిడి, మానసిక ఆందోళనలతో సతమతం అయ్యేవారు తిప్పతీగ చూర్ణాన్ని రోజూ తీసుకుంటే ఫలితం మంచి ఉంటుంది. జ్ఞాపకశక్తి కూడా మెరుగవుతుంది.

Bhavanam Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now