---Advertisement---

Dates : రోజూ రాత్రి ప‌డుకునే ముందు 2 ఖ‌ర్జూరాల‌ను తినండి.. ఎన్ని ప్ర‌యోజ‌నాలో తెలుసా..?

August 11, 2023 7:36 PM
---Advertisement---

Dates : చాలా మంది డ్రై ఫ్రూట్స్ ని రోజు తీసుకుంటూ ఉంటారు. ప్రతిరోజు ఖర్జూరాన్ని కూడా చాలామంది తింటూ ఉంటారు. ఖర్జూరం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఖర్జూరం వల్ల కలిగే లాభాలు ఇన్నీ అన్నీ కావు. ఖర్జూరంలో ఫైబర్, క్యాల్షియం, ఐరన్, పొటాషియం వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అనారోగ్య సమస్యలని అధిగ‌మించడానికి ఖర్జూరం బాగా సహాయపడుతుంది. రాత్రి పడుకునే ముందు రెండు ఖర్జూరాలు తిన్నా ఎన్నో లాభాలని పొంద‌వ‌చ్చు. రాత్రిళ్ళు నిద్రపోయే ముందు రెండు ఖర్జూరాలు తీసుకుని, ఒక గ్లాసు పాలు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది.

రోజు ఖర్జూరం తినడం వలన కంటి ఆరోగ్యం కూడా బాగుంటుంది. కంటి చూపు మెరుగు పడుతుంది. కంటి ఆరోగ్యానికి అవసరమైన పోషక పదార్థాలు ఖర్జూరంలో ఉంటాయి. ఖర్జూరాన్ని తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు. వీటిలో ఉండే ప్రోటీన్స్ కండరాలని దృఢంగా మార్చగలవు. ఖర్జూరాన్ని రోజూ తీసుకోవడం వలన మలబద్ధకం సమస్య నుండి బయటపడవచ్చు.

take 2 dates daily before sleep for these benefits
Dates

ఇందులో ఉండే పీచు.. మలబద్ధకం సమస్య నుండి ఉపశమనాన్ని ఇస్తుంది. గుండెకి కూడా ఖర్జూరం చాలా మేలు చేస్తుంది. ఖర్జూరంలో యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు శరీరంలోని చెడు వ్యర్ధాలని తొలగించేందుకు సహాయపడతాయి. ఖర్జూరం తీసుకోవడం వలన బరువు కూడా తగ్గవ‌చ్చు. ప్రతిరోజూ రాత్రి నిద్రపోయే ముందు, రెండు ఖర్జూరాలను తీసుకుంటే, పొట్ట కొవ్వు కూడా తొలగిపోతుంది.

జుట్టు మరియు చర్మ ఆరోగ్యానికి కూడా ఖర్జూరాలు బాగా సహాయపడతాయి. రోజూ రాత్రి నిద్రపోయే ముందు, రెండు ఖర్జూర పండ్లను తినడం వలన జుట్టు, చర్మం రెండూ బాగుంటాయి. చర్మ సమస్యల్ని కూడా ఖర్జూరం దూరం చేయగలదు. కీళ్ల సమస్యలతో బాధపడే వాళ్ళు కూడా ఖర్జూరం ద్వారా ఉపశమనాన్ని పొంద‌వ‌చ్చు. కీళ్ల నొప్పులు ఖర్జూరంతో తొలగిపోతాయి. ఇలా రోజూ రాత్రి రెండు ఖర్జూర పండ్లను తినడం వలన ఈ లాభాలను పొంది ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు. రోజూ రెండు ఖర్జూరాలని తీసుకుంటే.. ఈ సమస్యలే వుండవు.

Bhavanam Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now