Sunscreen Lotion : బ‌య‌ట‌కు వెళ్లేట‌ప్పుడు త‌ప్ప‌నిస‌రిగా స‌న్‌స్క్రీన్ లోష‌న్ రాసుకోండి.. దీంతో ఎన్నో లాభాలు క‌లుగుతాయి..!

October 9, 2023 9:39 PM

Sunscreen Lotion : సన్ స్క్రీన్ రాసుకోవడం వలన, ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అందుకని, ప్రతిరోజు కూడా సన్ స్క్రీన్ రాసుకోవడం మంచిది. ఎండలోకి వెళ్ళేటప్పుడు కాకుండా, నార్మల్ టైం లో కూడా సన్ స్క్రీన్ రాసుకోవడం మంచిది. సన్ స్క్రీన్ ని రాసుకోవడం వలన, ఎటువంటి లాభాలని పొందవచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. సన్ స్క్రీన్ రాసుకోవడం వలన, చర్మం బాగుంటుంది. చర్మం రంగు కూడా మెరుగు పడుతుంది. బయటికి వెళ్ళినప్పుడు, మన స్కిన్ పాడవుతూ ఉంటుంది. అలాంటప్పుడు, సన్ స్క్రీన్ రాసుకుని వెళ్లడం వలన స్కిన్ లో ఎలాంటి మార్పు రాదు. వయసు పెరిగే కొద్దీ, చర్మం పాడవుతూ ఉంటుంది. ముడతలు రావడం సహజం.

అయితే, ముడతలు, ఫైన్ లైన్స్, వయసు సరికే కొద్ది వచ్చే మచ్చలు వంటివి సన్ స్క్రీన్ రాసుకోవడం వలన కలగవు. యూవీ రేడియేషన్ నుండి చర్మానికి రక్షణ లభిస్తుంది. రోజు సన్ స్క్రీన్ రాసుకోవడం వలన, చర్మం నల్లబడకుండా కూడా ఉంటుంది. సాధారణంగా, మనం ఎండలోకి వెళ్లినప్పుడు, చర్మం పాడవుతూ ఉంటుంది. బాగా ఎండలో తిరిగే వాళ్ళకి, చర్మం నల్లగా అయిపోతూ ఉంటుంది. అటువంటి బాధాలేమీ కూడా కలగకుండా ఉండడానికి సన్ స్క్రీన్ రాసుకోవడం మంచిది. చర్మం కూడా హైడ్రేట్ గా ఉంటుంది.

Sunscreen Lotion apply before you go outside for these benefits
Sunscreen Lotion

చర్మం పాడవకుండా ఉంటుంది. యువి డామేజ్ వలన చర్మం నల్లబడడం, పాడవడం వంటివి సహజం. కానీ, సన్ స్క్రీన్ రాసుకోవడం వలన ఎటువంటి బాధలు ఉండవు. స్కిన్ క్యాన్సర్ రాకుండా కూడా ఉండడానికి సన్ స్క్రీన్ బాగా ఉపయోగపడుతుంది. కొంతమంది స్కిన్ చాలా సెన్సిటివ్ గా ఉంటుంది.

అటువంటి వాళ్ళు, కొంచెం ఎండలోకి వెళ్లేసరికి చర్మం ఎర్రబడడం, మంట కలగడం లేదంటే కొంచెం డిస్ కంఫర్ట్ గా అనిపించడం వంటివి జరుగుతూ ఉంటాయి. కానీ, సన్ స్క్రీన్ రాసుకుని వెళ్లడం వలన ఇలాంటి ఇబ్బందులు ఏమీ ఉండవు. సాధారణంగా, నార్మల్ క్రీమ్స్ ని ఎలా అయితే అప్లై చేసుకుంటారో, అలానే సన్ స్క్రీన్ కూడా రోజు వాడడం మంచిది. అప్పుడు, ఇలాంటి నష్టాలు ఏమీ కలగకుండా చర్మం బాగుంటుంది. మరింత అందంగా కనపడతారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now