Sesame Seeds : నువ్వుల‌ను ఇలా వాడండి.. అద్భుతాలు జ‌రుగుతాయి..!

October 26, 2023 9:52 PM

Sesame Seeds : ఆరోగ్యానికి నువ్వులు ఎంతో మేలు చేస్తాయి. నువ్వులను తీసుకోవడం వలన, అనేక లాభాలు ఉంటాయి. 100 గ్రాములు నువ్వులలో, 1450 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. పెద్దలైతే రోజు కి, 450 మిల్లీ గ్రాముల క్యాల్షియం తీసుకోవాలి. పిల్లలు 600 మిల్లీ గ్రాములు, గర్భిణీలు 900 మిల్లీ గ్రాముల క్యాల్షియం తీసుకోవాలి. ఒక గ్లాసు పాలల్లో 150 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. కాలుష్యం పొందడానికి, నువ్వులు మంచివి. నువ్వులను తింటే, వేడి చేస్తుందని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ, నిజానికి ఒంట్లో వాటర్ శాతం తగ్గితేనే, వేడి చేస్తుంది.

ప్రతి ఒక్కరు కూడా, రోజుకి నాలుగు ఐదు లీటర్లు నీళ్లు తాగాలి. నువ్వులను తీసుకోవడం వలన గర్భం పోతుందని కూడా అంటూ ఉంటారు. అలానే, నువ్వులు తినడం వలన ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతాయని నమ్ముతారు. కానీ నిజానికి నువ్వులు తింటే పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారట. నువ్వులను వేయించి పొడి కింద చేసుకుని, కూరల్లో వేసుకోవచ్చు. నువ్వులను నానబెట్టి బాగా నానిన తర్వాత, నోట్లో వేసుకొని నమిలి తింటే కూడా మంచిదే.

Sesame Seeds in telugu many health benefits
Sesame Seeds

మిక్సీ లో వేసి వచ్చిన పాలని తాగితే కూడా క్యాల్షియం బాగా అందుతుంది. పూర్వకాలం లో ఎక్కువగా నువ్వుల్ని వాడేవారు. బారసాల వంటి వాటిలో, నువ్వులని ఉండలు కింద చేసి, ప్రసాదంగా పెట్టేవారు. నువ్వులను వాడితే, ఎన్నో రకాల లాభాలు ఉంటాయి. ముఖ్యంగా కాల్షియం అంది, ఎముకల సమస్యలు వంటి వాటికి దూరంగా ఉండవచ్చు.

గుండెపోటు, చర్మ సమస్యలు కూడా నువ్వుల్ని తీసుకోవడం వలన రావు. పైల్స్, మలబద్ధకం సమస్యలు కూడా తగ్గుతాయి. చూశారు కదా, నువ్వుల వల్ల ఉపయోగాలు. మరి నువ్వులను రెగ్యులర్ గా తీసుకుని, ఇటువంటి సమస్యలన్నిటికీ కూడా దూరంగా ఉండండి. ఏ సమస్య లేకుండా ఆరోగ్యంగా ఉండండి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now