Sesame Laddu : మన పెద్దలు నువ్వులు, నువ్వుల నూనెను ఎన్నో రకాలుగా ఉపయోగించేవారు. నువ్వుల నూనె అత్యంత ఉత్తమమైందిగా చెబుతారు. ఆయుర్వేదంలో దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. నువ్వుల నూనెతో శరీరాన్ని మసాజ్ చేస్తారు. దీంతో ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఇక నువ్వులను కూడా మనం తరచూ ఉపయోగిస్తూనే ఉంటాం. నువ్వులతో ఎన్నో రకాల తీపి వంటకాలను చేస్తారు. వాటిల్లో నువ్వుల లడ్డూలు కూడా ఒకటి. అయితే వీటి రుచి కారణంగా ఈ లడ్డూలను తినేందుకు ఎవరూ ఇష్టపడరు. కానీ నువ్వులతో లడ్డూలను తయారు చేసి రోజుకు ఒకటి చొప్పున తింటే చాలు.. ఎన్నో లాభాలను పొందవచ్చు. నువ్వుల లడ్డూలను రోజుకు ఒకటి తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
నువ్వుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అందువల్ల రోజుకు ఒక లడ్డూను తింటే మన ఎముకలు బలంగా మారుతాయి. విరిగిన ఎముకలు అతుక్కుంటున్న వారు ఈ లడ్డూలను తింటుంటే త్వరగా కోలుకుంటారు. చిన్నారులు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులు తింటే బిడ్డకు కూడా ఎంతో పోషణ లభిస్తుంది. ఇక ఈ లడ్డూల్లో ఐరన్ కూడా ఎక్కువే. ఇది రక్తహీనత నుంచి బయట పడేస్తుంది. అందువల్ల రక్తహీనత ఉన్నవారికి ఈ లడ్డూలు ఎంతో మేలు చేస్తాయి.
ఒక్క నువ్వుల లడ్డూలో దాదాపుగా 62 క్యాలరీలు ఉంటాయి. అందువల్ల ఈ లడ్డూలను తింటే బరువు పెరుగుతామన్న భయం కూడా అవసరం లేదు. పైగా ఎన్నో పోషకాలు లభిస్తాయి. అవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ లడ్డూను తినడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ మొత్తం కరిగిపోతుంది. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ లు రాకుండా అడ్డుకోవచ్చు. అలాగే షుగర్ లెవల్స్ నియంత్రణలోకి వస్తాయి.
ఉదయం అల్పాహారం చేసిన అనంతరం దీన్ని ఒక్క లడ్డూను తింటే చాలు.. రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా పనిచేస్తారు. నీరసం, అలసట అనేవి ఉండదు. ఉదయం నుంచే బద్దకంగా, నీరసంగా ఉందని భావించేవారు ఈ లడ్డూను తింటే చాలు.. ఎంతో శక్తి లభిస్తుంది. దీంతో ఉత్సాహంగా మారుతారు. ఈ లడ్డూల్లో పాలిఅన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి బీపీని నియంత్రించేందుకు సహాయ పడతాయి. అందువల్ల ఈ లడ్డూలను తింటే హైబీపీ తగ్గుతుంది. అలాగే ఒత్తిడి మటుమాయం అవుతుంది. జీర్ణ సమస్యలు ఉండవు. ముఖ్యంగా మలబద్దకం తగ్గుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. కాంతివంతంగా మారి మెరుస్తుంది. ఇలా నువ్వుల లడ్డూలు రోజుకు ఒకటి తినడం ద్వారా ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…