Curry Leaves : కూర, సాంబార్ వంటి వంటకాలే కాదు, పులిహోర, ఫ్రైడ్‌రైస్ తదితర రైస్ ఐటమ్స్ తినే సమయంలో మీరు ఒకటి గమనించారా..? అదేనండీ కరివేపాకు! ఆ.. అయితే ఏంటి..? అని కరివేపాకును అలా తీసి పారేయకండి. ఎందుకంటే అందులో గొప్ప ఔషధగుణాలు ఉన్నాయి. వాటి గురించి తెలిస్తే ఇక మీరు కరివేపాకును పడేయరు గాక పడేయరు. కరివేపాకును నిత్యం మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కలిగే లాభాలను, దాంతో దూరమయ్యే అనారోగ్య సమస్యలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించే గుణం కరివేపాకులో ఉంది. నిత్యం 10 కరివేపాకు ఆకులను ఉదయాన్నే పరగడుపున తింటే అధిక బరువు సులభంగా తగ్గుతుంది.
దీంతోపాటు డయాబెటిస్ సమస్య కూడా అదుపులోకి వస్తుంది. దాదాపు 3 నుంచి 4 నెలల పాటు ఇలా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. కరివేపాకు, జీలకర్ర పొడిని పాలల్లో కలిపి తీసుకుంటే అజీర్ణ సమస్య దూరమవుతుంది. ఇది నీరసాన్ని కూడా తగ్గిస్తుంది. కమిలిన గాయాలకు, దెబ్బలకు కరివేపాకుల గుజ్జును రాస్తే అవి వెంటనే తగ్గిపోతాయి. గర్భిణీలకు తలెత్తే వికారం సమస్య తొలగిపోవాలంటే ఒక స్పూన్ తేనె, అర స్పూన్ నిమ్మరసంలో కరివేపాకు పొడిని కలిపి తీసుకోవాలి. పుల్లటి పెరుగులో కొద్దిగా నీటిని కలిపి అందులో కరివేపాకు, అల్లం ముక్కలు, కొద్దిగా పచ్చిమిర్చి, ఉప్పు కలిపి తాగితే శరీరంలో ఉన్న వేడి తగ్గిపోతుంది. ఇది వేసవి కాలంలో బాగా ఉపయోగపడుతుంది.
కొద్దిగా కరివేపాకులను తీసుకుని వాటిని గుజ్జుగా చేసి తిన్నా, లేదా వాటి జ్యూస్ తాగినా డయేరియా సమస్య నుంచి బయటపడవచ్చు. కరివేపాకుల రసం, నిమ్మరసం కలిపి తీసుకుంటే గ్యాస్ సమస్యలు తొలగిపోతాయి. దీనికి మజ్జిగను కలిపి ఉదయాన్నే పరగడుపున సేవిస్తే ఇంకా మంచి ఫలితం కలుగుతుంది.
కరివేపాకుల పొడిని కూరలు, సూప్‌లలో ఎక్కువగా ఉపయోగిస్తే దాని ద్వారా శరీరానికి కావల్సిన ఎ, బి, సి, ఇ వంటి విటమిన్లు, పోషకాలు అందుతాయి. ఎండిన కరివేపాకుల పొడిని కొద్దిగా హెయిర్ ఆయిల్‌తో కలిపి తలకు పట్టించి మసాజ్ చేసి కొంత సేపటి తరువాత తలస్నానం చేయాలి. తరచూ ఇలా చేస్తే వెంట్రుకలు బాగా పెరుగుతాయి. కుదుళ్లు దృఢత్వాన్ని సంతరించుకుంటాయి.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…