Segmented Sleep : శారీరక, మానసిక ఒత్తిడి, అలసట, అనారోగ్యం.. ఇలా కారణాలు ఏమున్నా నేడు అధిక శాతం మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. అయితే నిద్రలేమి లేదా వేరే ఇతర కారణాల వల్ల రాత్రి పూట నిద్ర నుంచి 2, 3 సార్లు లేచినా అది మన శారీరక ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపించదట. పైగా అది మనకు ఆరోగ్యాన్ని కూడా కలిగిస్తుందట. ఈ విషయాన్ని పలువురు వైద్య పరిశోధకులు తాజాగా వెల్లడించారు. నిత్యం 8 గంటల నిద్ర ప్రతి ఒక్కరికి తప్పనిసరి కాదు. కొంత మంది కేవలం కొద్ది గంటలు మాత్రమే పడుకుని రోజంతా యాక్టివ్‌గా ఉంటే, మరికొందరికి ఎక్కువ నిద్ర కావల్సి వస్తుంది. అది వారి శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది.
అయితే వైద్య పరిశోధకులు నిద్ర గురించి చేసిన పరిశోధనల ప్రకారం రాత్రి పూట పూర్తిస్థాయిలో నిద్ర పోవాల్సిన అవసరం లేదట. మధ్య మధ్యలో 2, 3 సార్లు లేచినా నిద్రలేమి సమస్యపై, ఆరోగ్యంపై అది ప్రభావం చూపదట. వైద్యులు చేసిన పరిశోధన ప్రకారం రాత్రిపూట నిద్రలో 2,3 సార్లు లేవడమే మంచిదట. ఒకప్పుడు మన పూర్వీకులు ఇలాగే నిద్రించే వారట. అలా నిద్రలో మెళకువ వచ్చి లేస్తే ఒక్కోసారి ఇంటికి సంబంధించిన ఏదైనా పనో లేదంటే ధ్యానమో చేసేవారట. ప్రపంచ వ్యాప్తంగా పారిశ్రామిక విప్లవం ప్రారంభమైన తొలి నాళ్లలో కూడా రాత్రి పూట నిద్రలో ఇలా 2,3 సార్లు లేచే వారట. అప్పట్లో ఇలాంటి నిద్ర వల్ల కలిగే లాభాలను పలువురు వైద్య నిపుణులు తమ పత్రాల్లో కూడా ప్రచురించారు. ఈ నిద్రను సెజ్‌మెంటెడ్ స్లీప్‌గా పిలుస్తున్నారు.
ఈ సెజ్‌మెంటెడ్ స్లీప్ వల్ల మెదడు పూర్తిగా హాయిని పొందుతుంది. ఒక నిద్రకు, మరో నిద్రకు మధ్య రిలాక్సేషన్‌ను కలిగించే ప్రొలాక్టిన్ అనే హార్మోన్ విడుదలవడం వల్లే మెదడు ఇలా హాయిని పొందుతుంది. శరీరం కూడా ఎక్కువ సందర్భాల్లో సెజ్‌మెంటెడ్ స్లీప్‌ని కోరుకుంటుందట. నిద్రలేమితో బాధపడే వారు ఈ నిద్ర విధానాన్ని అనుసరిస్తే చక్కని ఫలితాలు పొందవచ్చట. సెజ్‌మెంటెడ్ స్లీప్ నిద్రలేమి తనాన్ని దూరం చేస్తుందట. అయితే నిద్ర పోయేందుకు నిద్ర మాత్రలను ఎప్పటికీ వాడకూడదు. మన పూర్వీకులు సెజ్‌మెంటెడ్ స్లీప్‌ను ఎక్కువగా అనుసరించే వారట. దీంతో వారు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండే వారు. అప్పట్లో ఇప్పుడునన్ని సదుపాయాలు ఉండేవి కావుగా.
రాత్రి పూట ఎక్కువగా కరెంట్ కూడా ఉండేది కాదు. అయితే ఆ సమయంలో కరెంట్ సడెన్‌గా పోయినా మన పూర్వీకులు అందుకు తగ్గట్టుగా నిద్రించే వారట. ఇది కూడా వారిలో సెజ్‌మెంట్ స్లీప్ పాటించడానికి కారణమైంది. మనవారు సూర్యాస్తమయంతో నిద్రను ప్రారంభించి సూర్యోదయంతో నిద్రను ముగించేవారు. అయితే ఇందులో కూడా ఒక కారణం ఉంది. మన శరీరం కాంతికి, చీకటికి త్వరగా స్పందిస్తుంది. చీకటిగా ఉంటే మనకు నిద్ర ఎక్కువగా వస్తుంది. కాంతిలో తక్కువగా నిద్ర వస్తుంది. ఇది అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలోనే మన పెద్దలు ముందు పేర్కొన్న విధానాన్ని పాటించే వారు. సో.. మనం కూడా మన పెద్దల్లాగే సెజ్‌మెంటెడ్ స్లీప్‌ను, వారి నిద్ర విధానాలను పాటిస్తే ఎంచక్కా ఆరోగ్యంగా ఉండవచ్చు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…