Saraswathi Plant : ఈ భూమిపై ఎన్నో రకాల వృక్ష జాతులు ఉన్నాయి. కొన్ని మొక్కల దశలోనే ఉంటే, కొన్ని మాత్రం మహా వృక్షాలుగా భారీగా ఎదుగుతాయి. అయితే ఆయుర్వేదం ప్రకారం ఈ భూ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మొక్క ఏదో ఒక ఔషధ గుణాన్ని కలిగి ఉంటుంది. కొన్ని మొక్కలు, వృక్షాలు అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. అంతెందుకు మనం ఇప్పుడు వాడుతున్న చాలా వరకు ఇంగ్లిష్ మెడిసిన్స్‌ను మొక్కలు, చెట్లకు చెందిన ఆకులు, పండ్లు, వేర్ల నుంచే తయారు చేస్తారు. అయితే ముందు చెప్పినట్టుగా అనేక రకాల ఔషధ గుణాలు కలిగిన మొక్కల విషయానికి వస్తే అలాంటి వాటిలో సరస్వతి మొక్క కూడా ఒకటి. దీన్నే బ్రహ్మణి, బ్రాహ్మి మొక్క అని కూడా పిలుస్తారు. ఈ క్రమంలో ఈ మొక్క ద్వారా కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
పేరుకు తగినట్టుగానే సరస్వతి మొక్క ఆకులు మెదడు పనితీరును మెరుగు పరచడంలో బాగా ఉపయోగపడతాయి. ఇవి జ్ఞాపకశక్తిని పెంచుతాయి. నిత్యం 4 సరస్వతి ఆకులను అలాగే నమిలి తింటుంటే మేథస్సు పెరుగుతుంది. మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది. పాఠశాలకు, కళాశాలలకు వెళ్లి చదువుకునే విద్యార్థులు ఆ మొక్క ఆకులను బాగా నలిపి రసం తీసి దాన్ని పాలలో కలుపుకుని నిత్యం తాగితే వారి జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతుంది. చదువు బాగా వస్తుంది. పచ్చ కామెర్లు వచ్చిన వారికి ఈ మొక్క ఆకుల నుంచి తీసిన రసాన్ని నిత్యం తాగిస్తుంటే వెంటనే కోలుకుంటారు. సరస్వతి ఆకుల రసాన్ని నిత్యం తాగుతుంటే ఆయుష్షు పెరుగుతుంది.
ఈ మొక్క ఆకుల నుంచి తీసిన రసం రక్తాన్ని శుభ్ర పరుస్తుంది. కొంత వామును తీసుకుని పొడి చేసి దాంట్లో సరస్వతి మొక్క ఆకుల రసాన్ని కలిపి తీసుకుంటుంటే కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. ఈ మొక్కల ఆకులను మజ్జిగలో 3 రోజులు నానబెట్టి ఎండించి పొడి చేయాలి. దీన్ని రోజూ టానిక్‌లాగా పిల్లలకు ఇవ్వాలి. దీంతో వారికి బలం బాగా చేకూరుతుంది. సరస్వతి మొక్క ఆకులను నీడలో ఎండబెట్టి పొడి చేసి దాంతో తేనెను కలిపి తీసుకుంటే గొంతు బొంగురు తగ్గుతుంది. స్వరపేటిక వృద్ధి చెంది మంచి కంఠ స్వరం కూడా కలుగుతుంది. సరస్వతీ ఆకులను నీడలో ఎండబెట్టాలి. అయిదు బాదంపప్పులు, రెండు మిరియాలు, వేడి నీరు పోసి ఈ ఆకులను మెత్తగా రుబ్బాలి. తరువాత దానిని పలుచని వస్త్రంతో వడకట్టి, తగినంత తేనె కలిపి 40 రోజులపాటు రోజు ఉదయం తీసుకుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఈ ఔషధాన్ని మాటలు సరిగ్గా రాని పిల్లలకు వాడుతారు. నత్తిని తగ్గించే శక్తి దీనికి ఉంది.
పైన చెప్పిన అనారోగ్య సమస్యలకే కాదు సరస్వతి మొక్క ఇతర పనులకు ఉపయోగపడుతుంది. దీన్ని పెంచడం వల్ల అన్ని రకాల అరిష్టాలు పోతాయట. అంతేకాదు ఈ మొక్కను పూజిస్తే అనుకున్న పనులు సకాలంలో జరగడంతోపాటు అంతా శుభమే కలుగుతుందట.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్‌లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్‌లైన్ బుకింగ్‌లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…