Foot Massage With Oil : ఆయుర్వేదం ప్రకారం రాత్రి పడుకునే ముందు రెండు నిమిషాల పాటు పాదాలను నూనెతో మసాజ్ చేయడం వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. మన శరీరంలోని అతి ముఖ్యమైన భాగాలలో పాదాలు ఒకటి. రోజంతా నడవటం, చెప్పులు, బూట్లు వేసుకోవటం వలన కొన్ని సార్లు రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడి పాదాలు వాపులకు గురి అవుతాయి. అధిక బరువు ఉన్నప్పుడు, గర్భధారణ సమయంలో బరువు పాదాలపై పడటం వల్ల నొప్పి, వాపు వంటివి వస్తాయి. కాబట్టి ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు పాదాలకు నూనె రాసి రెండు నిమిషాల పాటు మసాజ్ చేయడం చాలా మంచిది. అలాగే ఇలా మసాజ్ చేయటం వలన ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి.
ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు పాదాలను శుభ్రంగా కడిగి తుడిచి నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె లేదా ఆవనూనెను గోరువెచ్చగా చేసి రాసి రెండు నిమిషాల పాటు మసాజ్ చేయాలి. పగిలిన మడమలు మృదువుగా మారతాయి. రోజంతా పాదాలపై కలిగే ఒత్తిడి, బిగుతుగా ఉండే బూట్లు వేసుకోవడం వల్ల నరాలకు రక్తప్రసరణ సరిగా జరగదు. అలాగే ఒక్కోసారి నరాలు తెగిపోయేలా నొప్పి ఉంటుంది.
నూనెతో మర్దనా చేస్తే బిగుతుగా ఉన్న నరాలు రిలాక్స్ అవుతాయి. దీంతో రక్తప్రసరణ సులభతరం అవుతుంది. అలాగే పాదాల నొప్పులు కూడా తగ్గుతాయి. పాదాలకు నూనె రాసుకోవడం వల్ల ఒత్తిడి, అలసట తొలగిపోయి శరీరం మొత్తం రిలాక్స్‌గా ఉంటుంది. పాదాల నరాల్లో రక్తం గడ్డకట్టే సమస్య ఉన్నప్పుడు వచ్చే పాదాల నొప్పి నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. పాదాలను నూనెతో మసాజ్ చేయడం వల్ల పాదం, కాలు కండరాలు రిలాక్స్ అవుతాయి. పాదాలకు నూనె రాసి మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి నిద్ర బాగా పడుతుంది. అలాగే ఉదయం లేవగానే ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది. కాబట్టి ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు పాదాలకు నూనెతో మసాజ్ చేయండి. దీంతో ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…