Eye Twitching : ఆడవారికి ఎడమకన్ను అదిరితే మంచిదని.. మగవారికి కుడి కన్ను అదిరితే మంచిది అని అనడం మనం వింటుంటాం. మనకి వాస్తు శాస్త్రం లాగే శకున శాస్త్రం కూడా ఉంది. దాని ప్రకారం మన కన్నే కాదు మగవారికి కుడివైపు శరీర భాగం, ఆడవారికి ఎడమ వైపు శరీర భాగం అదిరితే మంచిదంటారు. దీనివెనుక రామాయణానికి సంబంధించి ఒక కథ చెబుతారు. శ్రీరామచంద్రుడు వానర సేనని తీసుకుని రావణుడి మీద యుద్ధానికి బయల్దేరినప్పుడు రావణాసురుడికి, సీతమ్మవారికి ఎడమ కన్ను అదిరాయట. సీతమ్మవారికి ఎడమ కన్ను అదిరిన ఫలితం కనిపించింది. రాముడు సీతను రావణాసురుడి చెరనుంచి విడిపించాడు. అలాగే రావణాసురుడుకి కీడు జరిగింది.
ప్రతిసారి శరీర భాగాలదిరినప్పుడు మనకి అనుకూలమైన సూచన అయితే ఏదో మంచి జరుగుతుందని.. కానప్పుడు ఏదో కీడు జరుగుతుందని అనుకోవడానికి లేదు. కేవలం కొన్ని సార్లు మాత్రమే అదిరితే అది శకునం కావచ్చు. కొందరు ఉదయం నుండీ రాత్రి దాకా అదిరిందంటారు. కొందరికి శరీర భాగాలు తరచూ అదరవచ్చు. అది నరాల బలహీనతకు సూచన.
ఆయుర్వేద శాస్త్రం ప్రకారం వాత, పిత్త గుణాలు ప్రకోపించినప్పుడు శరీరంలో భాగాలు అదురుతాయంటారు. కళ్ళ వ్యాధులున్నా కూడా కంటి భాగాలు తరచూ అదరవచ్చు. అలాంటప్పుడు డాక్టరుని సంప్రదించాలి. అయితే ఎలాంటి రోగాలు లేకుండా అంతా బాగానే ఉన్నప్పుడు ఇలా శరీర భాగాలు అదిరితే మాత్రం తప్పక శకున శాస్త్రం వర్తిస్తుందని చెబుతున్నారు. కనుక ఇకపై ఇలా జరిగితే అందుకు తగిన విధంగా స్పందించండి.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్‌లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్‌లైన్ బుకింగ్‌లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…