ఆరోగ్యం

Eyes Itching : క‌ళ్లు పొడిబార‌డం, దుర‌ద‌లు, మంట‌లు ఉన్నాయా..? ఇలా చేయండి..!

Eyes Itching : ఒక‌ప్పుడంటే రోజంతా బ‌య‌ట క‌ష్ట‌ప‌డి ప‌నిచేసేవారు. కానీ ఇప్పుడ‌లా కాదుగా, నిత్యం ఆఫీసుకు వెళితే ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్ పీసీలు, స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు.. వీటిపైనే ప‌ని. దీంతో నేత్ర సంబంధ స‌మ‌స్య‌ల బారిన ప‌డేవారు పెరుగుతున్నారు. కొంద‌రికి దృష్టి కూడా స‌రిగ్గా ఆన‌క‌పోతుండ‌డం వ‌ల్ల అద్దాలు, లెన్స్‌లు పెట్టుకోవాల్సిన ప‌రిస్థితి వ‌స్తోంది. ఇంకా కొంద‌రు రోజంతా క‌ళ్లు పొడిబార‌డం, మంట‌లు, దుర‌ద‌లు, కంటి నుంచి నీరు కార‌డం వంటి స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. అయితే కొన్ని సింపుల్ చిట్కాల‌ను పాటిస్తే కంటి స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక శుభ్రమైన వస్త్రాన్ని తీసుకుని గోరువెచ్చటి నీళ్లలో ముంచి ఆ వస్త్రాన్ని కళ్ల మీద 5 నిమిషాల పాటు ఉంచుకోవాలి. తరువాత ఆ వస్త్రంతోనే కళ్లపైనా మెత్తగా ఒత్తాలి. అలాగే కళ్ల లోపలా జాగ్రత్తగా ఆ వస్త్రంతో తుడుచుకోవాలి. ఇలా చేస్తే కళ్లల్లో పడిన దుమ్ము, ధూళి పోతుంది. కళ్లల్లో తిరిగి కన్నీళ్ల ఉత్పత్తి పెరుగుతుంది. తద్వారా కళ్లు పొడిబార‌డం త‌గ్గి దుర‌ద‌లు త‌గ్గిపోతాయి. దూదిని కొబ్బరి నూనెలో ముంచి కళ్లు మూసి కనురెప్పలపై ఆ దూదిని ఉంచాలి. అలా 15 నిమిషాల పాటు ఉంచాలి. దీంతో రిలీఫ్ వ‌స్తుంది. అయితే అలా రిలీఫ్ వ‌చ్చేంత వ‌ర‌కు దూదిని ఎన్ని సార్ల‌యినా అలా చేయ‌వ‌చ్చు.

Eyes Itching

అలోవెరా (క‌ల‌బంద‌) ఆకుని బాగా కడిగి దానిని కట్ చేసి మధ్యలోంచి అలోవెరా జెల్ ని బయటికి తీయాలి. ఆ జెల్ ని కనురెప్పలపై రాసుకుని కళ్లు మూసుకుని 10 నిమిషాల పాటు ఉండాలి. తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. రోజుకి ఇలా రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అలోవెరా జెల్ లో తేమ లక్షణాలు, యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు ఎక్కువ. దీంతో క‌ళ్లు పొడి బార‌కుండా ఉంటాయి. దుర‌ద‌లు, మంట‌లు త‌గ్గుతాయి. రోజ్ వాటర్ లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. విటమిన్ ఎ సరిగా అందకపోయినా కూడా కళ్లు పొడిబారతాయి. దూదిని రోజ్ వాటర్ లో ముంచి కళ్లు మూసుకుని కనురెప్పలపై ఆ దూదిని ఉంచాలి. 10 నిమిషాల పాటు అలా వదిలేశాక చల్లని నీటితో కడిగేసుకోవాలి. దీంతో క‌ళ్ల దుర‌ద‌లు, మంట‌లు త‌గ్గుతాయి.

తినే ఆహారంలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ‌గా ఉండేలా చూడాలి. అంటే చేప‌లు, అవిసె గింజెలు, వాల్ న‌ట్స్ వంటి ఆహార ప‌దార్థాల‌ను తింటే త‌ద్వారా ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు మ‌న‌కు ఎక్కువగా ల‌భిస్తాయి. దీంతో కంటి ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

సీఎస్కేలో ధోనీ నుంచి పాఠాలు నేర్చుకుంటా.. సంజు శాంసన్ ఎమోషనల్ కామెంట్స్!

త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూప‌ర్ కింగ్స్ (CSK) జ‌ట్టు త‌ర‌ఫున ఆడ‌నున్న…

Monday, 16 March 2026, 10:40 PM

సల్మాన్ ఖాన్ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వన్’ టైటిల్ మార్పు.. భాయ్ మూవీ కొత్త పేరు ఏంటంటే?

స‌ల్మాన్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వ‌న్ మూవీ నుంచి ఓ కీల‌క అప్‌డేట్ వ‌చ్చింది. ఈ…

Monday, 16 March 2026, 8:17 PM

రణవీర్ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ ఊచకోత.. విడుదలకు ముందే రూ.60 కోట్లు!

రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…

Monday, 16 March 2026, 3:49 PM

వరల్డ్ కప్ ఫైనల్ బ్యాట్‌ను అక్షయ్‌కు గిఫ్ట్ ఇచ్చిన అభిషేక్ శర్మ.. ఎందుకంటే?

భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…

Sunday, 15 March 2026, 10:44 PM

‘రంగీలా’ పాట చూసి ‘భూత్’ ఆఫర్ ఇచ్చా.. ఊర్మిళా మతోండ్కర్‌పై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన త‌న భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…

Sunday, 15 March 2026, 8:15 PM

ధురంధర్ 2 బాక్సాఫీస్ సునామీ.. విడుదలకు ముందే రూ.32 కోట్ల వసూళ్లు!

భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…

Sunday, 15 March 2026, 4:01 PM

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది.. పవన్ కళ్యాణ్ మాస్ జాతర! శ్రీలీలతో రొమాన్స్ అదిరింది..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…

Sunday, 15 March 2026, 3:04 PM

వింత రనౌట్ వివాదం.. పాక్ ప్లేయర్‌కు ఐసీసీ షాక్! ఆ తప్పు చేసినందుకు భారీ జరిమానా..

బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…

Saturday, 14 March 2026, 10:32 PM