Making Of Phool Makhana : ప్రస్తుత తరుణంలో చాలా మంది తమ ఇష్టాలకు అనుగుణంగా వివిధ రకాల వంటలను ఆరగిస్తున్నారు. యూట్యూబ్ పుణ్యమా అని అందులో చూసి నేర్చుకుని మరీ కొత్త కొత్త వంటకాలను చేస్తున్నారు. అయితే కొన్ని మన దగ్గర పాపులర్ కాని వంటలు కూడా ఇప్పుడు పాపులర్ అవుతున్నాయి. అలాంటి వాటిల్లో ఫూల్ మఖనా కూడా ఒకటి. వీటినే తామర విత్తనాలు అని కూడా అంటారు. వీటిని సూపర్ మార్కెట్లలో చాలా మంది చూసే ఉంటారు. ఖరీదు కాస్త ఎక్కువే ఉంటాయి. కానీ ఇవి అందించే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు అనేకం. వీటిని తింటే ఎన్నో లాభాలను పొందవచ్చు.
ఫూల్ మఖనాలను ఒక ప్రత్యేక పద్ధతిలో తయారు చేస్తారు. తామర మొక్కలు పెరుగుతున్న కొలనులలో తామర విత్తనాలను ముందుగా సేకరిస్తారు. వీటి సేకరణ చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని. అందుకనే ఇవి అంత ఖరీదును కలిగి ఉంటాయి. ఇక ఈ విత్తనాలను సేకరించిన తరువాత శుభ్రం చేసి వాటిని ఎండలో ఎండబెడతారు. తరువాత వాటిని పెనంపై పాప్ కార్న్ వేయించినట్లు వేయిస్తారు. దీంతో అవి ఉబ్బిపోయి తెల్లగా మారుతాయి. ఇలా ఫూల్ మఖనాలను తయారు చేస్తారు. వీటిని మనం అనేక రకాలుగా తీసుకోవచ్చు.
ఫూల్ మఖనాలను స్వీట్ల తయారీలో ఉపయోగిస్తారు. అలాగే వీటితో మసాలా కూరలను కూడా చేయవచ్చు. వీటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో పోషకాలు లభిస్తాయి. ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి. వీటిని తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతో గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. ఇవి షుగర్ ఉన్నవారికి కూడా మేలు చేస్తాయి. అధిక బరువును తగ్గిస్తాయి. కనుక ఫూల్ మఖనాలు ఇకపై ఎక్కడైనా కనబడితే వదలకుండా ఇంటికి తెచ్చుకోండి. వీటితో అనేక ప్రయోజనాలను పొందవచ్చు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…