ఆరోగ్యం

Jowar Flour : ఈ పిండి గురించి తెలుసా..? ఇందులో దాగి ఉన్న ర‌హ‌స్యాలు ఇవే..!

Jowar Flour : పూర్వం మన పెద్ద‌లు ఆరోగ్యక‌ర‌మైన ఆహారం తినే వారు. అందుక‌నే వారు ఎక్కువ ఏళ్ల పాటు జీవించ‌గ‌లిగారు. కానీ మ‌నం వారు తిన్న ఆహారాన్ని మ‌రిచిపోతున్నాం. జంక్ ఫుడ్‌నే ఎక్కువ‌గా తింటున్నాం. అందువ‌ల్ల రోగాల బారిన ప‌డుతున్నాం. అందువ‌ల్ల మ‌న పెద్ద‌లు తిన్న ఆహారాల‌నే మ‌నం కూడా తినాలి. ఇక అలాంటి ఆహారాల్లో జొన్న‌లు కూడా ఒక‌టి. పూర్వం మ‌న పెద్ద‌లు జొన్న‌ల‌తో రొట్టెలు, సంగ‌టి, బువ్వ చేసుకుని తినేవారు. అయితే సంగ‌టి, బువ్వ తిన‌డం క‌ష్టం. కానీ జొన్న పిండితో రొట్టెల‌ను చేసుకుని తిన‌వ‌చ్చు. వీటిని ఎవ‌రైనా స‌రే చేసుకోవ‌చ్చు. జొన్న పిండితో జావ కూడా చేసి తాగ‌వ‌చ్చు. దీంతో మ‌న‌కు ఎన్నో లాభాలు క‌లుగుతాయి.

జొన్న‌ల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. క‌నుక వీటిని తీసుకుంటే ఎముక‌లు బ‌లంగా మారుతాయి. చిన్నారుల్లో అయితే ఎదుగుద‌ల స‌రిగ్గా ఉంటుంది. పొడ‌వుగా పెరుగుతారు. జొన్న‌ల్లో ఐర‌న్ అధికంగా ఉంటుంది. దీని వ‌ల్ల ర‌క్తం అధికంగా ఉత్ప‌త్తి అవుతుంది. దీంతో ర‌క్త‌హీన‌త నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఇక జొన్న‌ల్లో ఫైబ‌ర్ కూడా ఎక్కువ‌గానే ఉంటుంది. ఇది నెమ్మ‌దిగా జీర్ణ‌మ‌వుతుంది. దీంతో షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్ అవుతాయి. డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది.

Jowar Flour

జొన్న‌ల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరంలోని కొవ్వు క‌రుగుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. వీటిల్లో ఉండే ఫైబ‌ర్ జీర్ణ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తుంది. దీంతో అజీర్ణం, గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. జొన్న‌ల‌ను తిన‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. దీని వ‌ల్ల సీజ‌న‌ల్ వ్యాధులు రాకుండా ఉంటాయి. అలాగే జ్వ‌రాలు రావు. రోగాల బారి నుంచి శ‌రీరం సుర‌క్షితంగా ఉంటుంది.

జొన్న‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల పొటాషియం స‌మృద్ధిగా ల‌భిస్తుంది. ఇది హైబీపీని త‌గ్గిస్తుంది. బీపీని అదుపులో ఉంచుతుంది. దీని వ‌ల్ల ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. దీంతో గుండె జ‌బ్బులు రావు. హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవ‌చ్చు. ఇలా జొన్న‌ల‌తో మ‌నం అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. క‌నుక వీటిని రోజూ తీసుకోవాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

విజయ్ ‘జననాయకన్’ లీక్‌పై చిరంజీవి ఎమోషనల్.. పరిశ్రమకు ఇది పెద్ద దెబ్బ అంటూ ఆవేదన!

తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన‌ చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంట‌ర్నెట్‌లో…

Friday, 10 April 2026, 6:40 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్.. 5 నిమిషాల యాక్షన్ సీన్ నెట్టింట వైరల్! షాక్‌లో చిత్ర యూనిట్..

తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…

Friday, 10 April 2026, 12:43 PM

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM

చదువు ముఖ్యం, హీరోలు కాదు! యువతకు రజనీకాంత్ హితవు.. కమల్‌తో మూవీపై క్లారిటీ..

ప్ర‌స్తుత త‌రుణంలో యువ‌త హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువ‌గా ఆక‌ర్షిత‌మై చ‌దువుల‌పై శ్ర‌ద్ధ పెట్ట‌డం లేద‌ని, సామాజిక మాధ్య‌మాల వ‌ల్ల…

Thursday, 9 April 2026, 3:13 PM

భాష నేర్చుకుంటేనే నటన ఈజీ.. కయాదు లోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

న‌టీన‌టులు మాతృభాష‌లో కాకుండా ఇత‌ర భాష‌ల్లో సినిమాలు చేస్తే ఆయా భాష‌ల‌ను నేర్చుకుంటేనే సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని న‌టి క‌యాదు లోహ‌ర్…

Thursday, 9 April 2026, 11:48 AM

అల్లు అర్జున్ – అట్లీ మూవీ టైటిల్ ‘రాకా’.. బీస్ట్ లుక్‌లో బన్నీని చూశారా?

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మొద‌టి చిత్రంగా ఇప్ప‌టి వ‌రకు…

Wednesday, 8 April 2026, 6:19 PM

రూ.1700 కోట్ల క్లబ్‌లో రణవీర్ సింగ్ ‘ధురంధర్ 2’.. ఫిదా అయిన విరాట్ కోహ్లీ, అనుష్క!

ర‌ణ‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని నమోదు…

Tuesday, 7 April 2026, 10:59 PM