Honey Soaked Dates : తేనె.. మన శరీరానికి కావల్సిన ఎన్నో పోషకాలను అందిస్తుంది. అనేక రకాల ఔషధ గుణాలు ఇందులో ఉన్నాయి. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు తేనెలో ఉండడం వల్ల తేనె మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచి బలాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఎండు ఖర్జూరం పండ్లను కూడా చాలా మంది ఇష్టంగా తింటారు. వాటితో కూడా మనకు అనేక లాభాలే కలుగుతాయి. అయితే తేనెలో వారం రోజుల పాటు నానబెట్టిన ఎండ ఖర్జూరం పండ్లను మీరెప్పుడైనా తిన్నారా..? అలా తిన్నా.. మనకు అనేక రకాల ప్రయోజనాలే కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక జార్‌లో 3/4 వంతు తేనె తీసుకోవాలి. అందులో విత్తనాలను తీసిన ఎండు ఖర్జూరం పండ్లను వేయాలి. అనంతరం మూత బిగించి జార్‌ను బాగా షేక్ చేయాలి. అనంతరం ఆ జార్‌ను వారం పాటు అలాగే ఉంచాలి. అవసరం అనుకుంటే మధ్య మధ్యలో ఆ జార్‌ను షేక్ చేయవచ్చు. వారం తరువాత జార్‌ను తీసి రోజుకు ఒకటి రెండు చొప్పున ఆ ఖర్జూర పండ్లను తినాలి. దీంతో ఎలాంటి లాభాలు కలుగుతాయో చూద్దాం. పైన చెప్పినట్టుగా తయారు చేసిన తేనె, ఎండు ఖర్జూరం మిశ్రమం వల్ల దగ్గు, జలుబు వంటి శ్వాస సమస్యలు పోతాయి. జ్వరం తగ్గుతుంది. శరీర రోగ నిరోధక శక్తి రెట్టింపు అవుతుంది. దీంతో ఇన్‌ఫెక్షన్లు, వ్యాధులు రాకుండా ఉంటాయి.
నిద్ర బాగా పడుతుంది. నిద్రలేమితో బాధపడే వారు ఈ మిశ్రమం తింటే ఫలితం ఉంటుంది. ఒత్తిడి, ఆందోళన వంటివి కూడా తగ్గిపోతాయి. గాయాలు త్వరగా మానుతాయి. యాంటీ బయోటిక్ గుణాల వల్ల గాయాలు, పుండ్లు త్వరగా తగ్గుతాయి. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. చిన్నారులకు రోజూ ఈ మిశ్రమం తినిపిస్తే వారు చదువుల్లో బాగా రాణిస్తారు. పెద్దలు కూడా ఈ మిశ్రమం తింటే మతిమరుపు తగ్గుతుంది. మహిళలకు కావల్సిన ఐరన్, కాల్షియం పుష్కలంగా లభిస్తాయి. ఇవి రక్తహీనతను నివారించి ఎముకలను దృఢంగా చేస్తాయి. సీజనల్ గా వచ్చే వివిధ రకాల అలర్జీలు పోతాయి. ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. పలు రకాల క్యాన్సర్‌లకు విరుగుడుగా ఈ మిశ్రమం పనిచేస్తుంది. క్యాన్సర్ కణతులు వృద్ధి చెందవు.
జీర్ణ సంబంధ సమస్యలు దూరమవుతాయి. మలబద్దకం, గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు ఉండవు. పేగుల్లో మంచి బాక్టీరియా వృద్ధి చెందుతుంది. చెడు బాక్టీరియా నాశనమవుతుంది. కడుపులో క్రిములు ఉంటే చనిపోతాయి. రక్త సరఫరా మెరుగు పడుతుంది. రక్తం బాగా పెరుగుతుంది. రక్తహీనత ఉన్నవారికి ఇది మేలు చేస్తుంది. బీపీ తగ్గుతుంది. గుండె సంబంధ సమస్యలు రాకుండా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది. అధిక బరువు తగ్గుతారు. కొవ్వు కరిగిపోతుంది. ఇలా తేనె, ఖర్జూరాల మిశ్రమాన్ని రోజూ తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్‌లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్‌లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…