Curry Leaves : మనం రోజూ వంటల్లో ఉపయోగించే పదార్థాల్లో కరివేపాకు కూడా ఒకటి. కరివేపాకులను వేయడం వల్ల వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే కరివేపాకులను కూరల్లోంచి తీసిపారేస్తుంటారు. కానీ అలా పడేయరాదు. కరివేపాకులను తినడం వల్ల మనం ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. కరివేపాకులతో మనం ఎలాంటి రోగాలను నయం చేసుకోవచ్చో.. వాటిని ఎలా ఉపయోగించాలో.. ఇప్పుడు తెలుసుకుందాం. కరివేపాకులు మనకు అనేక రకాలుగా ఉపయోగపడతాయి.
కడుపులో తేడాగా రకరకాలుగా ఉంటే రెండు స్పూన్స్ కరివేపాకు రసంలో ఓ స్పూన్ నిమ్మరసం, కొద్దిగా పంచదార కలిపి తాగండి. ప్రశాంతంగా ఉంటుంది. కరివేపాకును పేస్ట్ లా చేసి ఒక స్పూన్ పేస్ట్ ని ఒక గ్లాస్ పలుచని మజ్జిగలో కలిపి అప్పుడప్పుడూ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఇలా వేసవిలో తీసుకుంటే శరీరానికి చలువ చేస్తుంది. శరీరంలోని వేడి మొత్తం తగ్గిపోతుంది. అలాగే శరీర బరువును, రక్తంలో చక్కెరను తగ్గించే గుణాలు కరివేపాకులో అధికంగా ఉంటాయి. కాబట్టి వంశపారంపర్యంగా మధుమేహం వచ్చే అవకాశాలు ఉన్నవారు రోజూ ఉదయం పది కరివేపాకులని నోట్లో వేసుకుని నేరుగా అలాగే నమిలి మింగాలి. దీంతో షుగర్ రాదు. షుగర్ ఉన్నవారు కూడా ఇలా చేస్తే షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి.
కాలిన గాయాల మీద కరివేపాకు పేస్ట్ ని వేసి కట్టుకడితే త్వరగా తగ్గుముఖం పడతాయి. కరివేపాకు చెట్టుకి ఉండే కాయల నుంచి రసం తీసి రాస్తే పురుగులు కుట్టినచోట వచ్చే దద్దుర్లు తగ్గిపోతాయి. ఒక బౌల్ లో కొబ్బరినూనెలో కరివేపాకులు వేసి ఆకులు నల్లగా పొడి పొడి అయ్యేవరకు స్టవ్ మీద పెట్టి వేడి చేసి తర్వాత చల్లార్చి పెట్టుకోండి. ప్రతిరోజూ ఈ ఆయిల్ ని తలకు రాసుకోవడం వల్ల జుట్టు రాలడం, నెరవడం వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు.
కరివేపాకును పచ్చడిగానో లేక విడిగానో తిన్నా, లేదా దాని రసం మజ్జిగలో కలుపుకుని రోజూ తాగినా అది ఒంటికి చాలా మంచి చేస్తుంది. దీంతో కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండె సంబంధ సమస్యలు రావు. అలాగే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. ఇలా కరివేపాకులతో మనం ఎన్నో రోగాలను నయం చేసుకోవచ్చు. కనుక వీటిని రోజూ తీసుకోవడం మరిచిపోకండి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…