Hing : ఇంగువ వేసి చేసిన పులిహోర అంటే చాలా మందికి ఇష్టమే. అంతెందుకు.. ఇంగువ వేస్తే పప్పుచారు కూడా చాలా రుచిగా ఉంటుంది. అందుకే దీన్ని చాలా మంది వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే నిజానికి ఇంగువ ఎలా వస్తుందో చాలా మందికి తెలియదు. ఇది ఓ మొక్క నుంచి వస్తుంది. ఫెరూలా అని పిలవబడే ఓ రకమైన వృక్షజాతికి చెందిన పాలను ఉపయోగించి ఇంగువను తయారు చేస్తారు. ఈ క్రమంలో ఇంగువ వల్ల మనకు రుచి మాత్రమే కాదు, దాంతో ఇంకా అనేక ఇతర లాభాలు కూడా మనకు కలుగుతాయి. ఇంగువ వల్ల మనకు కలిగే ఆరోగ్యకర ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంగువ వేసిన ఆహారం తింటే గ్యాస్ సమస్య ఉండదు. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. అజీర్ణ సమస్య బాధించదు. మలబద్దకం, అసిడిటీ ఉండదు. ఇతర జీర్ణ సమస్యలున్నా పోతాయి. పలు రకాల అల్సర్లను నయం చేసే శక్తి ఇంగువకు ఉందని పలు పరిశోధనలు తేల్చి చెప్పాయి. అంతేకాదు, ఆకలి లేకున్నా దీంతో చేసిన పదార్థాలను తింటే బాగా ఆకలి పెరుగుతుంది. యునానీ వైద్యంలో ఇంగువను పలు అనారోగ్య సమస్యలకు ఔషధంగా కూడా వాడుతున్నారు. ఫిట్స్, ఇతర మానసిక సమస్యలకు ఇంగువ చక్కని ఔషధంగా పనిచేస్తుంది.
మహిళల్లో రుతు క్రమంలో వచ్చే సమస్యలు సహజం. అయితే వాటితోపాటు రుతు క్రమం సరిగ్గా లేని మహిళలు కూడా ఇంగువతో చేసిన ఆహారం తింటే దాంతో వారిలో రుతుక్రమం మెరుగవుతుంది. ఇది సంతాన సాఫల్యత అవకాశాలను పెంచుతుంది. ఆస్తమా, బ్రాంకైటిస్, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలు తగ్గిపోతాయి. తీవ్రమైన పడిశెం (ఇన్‌ఫ్లుయెంజా) వచ్చినా ఇంగువతో చేసిన ఆహారం తింటే వెంటనే ఆ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇంగువ వేసిన ఆహారం తింటే రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు అదుపులోకి వస్తాయి. ఇది డయాబెటిస్ ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తుంది. ఇన్సులిన్ లాగా పనిచేయడం వల్ల షుగర్ అదుపులో ఉంటుంది.
రక్త నాళాల్లో కొవ్వు గడ్డకట్టకుండా చూస్తుంది. దీంతో రక్త సరఫరా పెరిగి గుండె సమస్యలు రావు. తలనొప్పి, ఒళ్లు నొప్పులు తగ్గిపోతాయి. ఆయా నొప్పులను తగ్గించే గుణం ఇంగువకు ఉంది. ఇంగువను వంటల్లోనే కాక డైరెక్ట్‌గా కూడా తీసుకోవచ్చు. దీంతో ఆయా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే దాన్ని గోరు వెచ్చని నీటితోనో లేదా మజ్జిగతోనో తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో అనేక ప్రయోజనాలను పొందవచ్చు.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్‌గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్‌లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్‌కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…