Guava Leaves For Beauty : ఈ ఆకుల‌ను వాడితే చాలు.. మొటిమ‌లు, మ‌చ్చ‌లు అన్నీ మాయం..!

December 5, 2023 3:50 PM

Guava Leaves For Beauty : మీరు, మీ అందాన్ని పెంపొందించుకోవాలని అనుకుంటున్నారా..? అందాన్ని రెట్టింపు చేయడానికి, జామ ఆకులు బాగా ఉపయోగపడతాయి, జామ ఆకులతో మొటిమలు, నల్ల మచ్చలు కూడా తొలగిపోతాయి. జామ పండ్లు రుచి తియ్యగా ఉంటుంది. పైగా, జామ పండ్లు తీసుకోవడం వలన, పోషకాలు కూడా బానే అందుతాయి. జామ పండ్లు, జామ ఆకులు కూడా మంచి పోషకాలతో కూడి ఉంటాయి. జామ ఆకుల్ని తీసుకున్నట్లయితే, ఎన్నో రకాల చర్మ సమస్యలను తగ్గించుకోవచ్చు. మన ఇంట్లో ఉండే మొక్కల ఆకులలో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. కానీ, మనం పెద్దగా పట్టించుకోము. జామ ఆకులు బ్లాక్ హెడ్స్ ని తొలగించడానికి బాగా ఉపయోగపడతాయి.

జామ ఆకుల్ని శుభ్రంగా కడిగేసి, మెత్తని పేస్ట్ లాగ చేసుకుని, బ్లాక్ హెడ్స్ ఉన్నచోట రాసి, పది నిమిషాలు పోయిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే చాలు. ఒకవేళ బ్లాక్ హెడ్స్ మీకు ఎక్కువగా ఉంటే, వారానికి రెండు మూడుసార్లు కానీ రోజులు రెండు సార్లు కానీ చేయండి. జామ ఆకుల పేస్ట్ ని రాసుకోవడం వలన మొటిమలు, నల్లని మచ్చలు కూడా తగ్గిపోతాయి. జామ ఆకుల్లో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది.

Guava Leaves For Beauty how to use them must know
Guava Leaves For Beauty

విటమిన్ సి మొటిమలకి వ్యతిరేకంగా పోరాడుతుంది. జామ ఆకుల్లో యాంటి సెప్టిక్ గుణాలు కూడా ఉంటాయి. దీంతో మొటిమలకి కారణమైన బ్యాక్టీరియాని నియంత్రిస్తుంది. జామాకుల్ని మెత్తని పేస్ట్ గా చేసుకుని, కొంచెం పసుపు వేసుకుని మొటిమలు, నల్లని మచ్చలు ఉన్న చోట రాసి, ఐదు నిమిషాల తర్వాత ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి.

ఇలా చేస్తే, మొటిమలు, నల్ల మచ్చలు తొలగిపోతాయి. యాంటీ ఏజింగ్ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఫ్రీ రాడికల్స్ వలన, చర్మం దెబ్బ తినకుండా, జామ ఆకు కాపాడుతుంది కూడా. జామాకు పేస్ట్ చర్మం బిగుతుగా ఉండేటట్టు చేస్తుంది. ఎలర్జీలని దూరం చేస్తుంది. ఇలా, అనేక లాభాలను మనం జామ ఆకులతో పొందవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now