---Advertisement---

Drumstick Leaves : గుప్పెడు మునగాకుతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా..?

November 29, 2022 5:18 PM
---Advertisement---

Drumstick Leaves : వేడి వేడి సాంబార్ లో మునక్కాయ ముక్కలు కనబడ్డాయంటే  నమిలి నమిలి పిప్పి మిగలే వరకు వదలము. అంత ఇష్టం అందరికి మునక్కాయలు రుచి అంటే. మునగకాయలు మాత్రమే కాకుండా ఆకులు కూడా శరీరానికి  కావలసిన ఎన్నో పోషకాలను అందజేస్తుందని చెప్పవచ్చు. శిలీంద్రాలు, బాక్టీరియా, కీటకాల సంహారిణిగా మునగాకు బాగా పనిచేస్తుంది. మునగాకులో పొటాషియం, బీటా కెరోటిన్, కాల్షియం, మాంసకృత్తులు, ఐరన్ ఎక్కువగా ఉంటుంది.

ఆకుకూరల్లా మునగాకును కూడా వివిధ రకాలుగా వండుకుంటారు. మునగాకుల్ని ఎండబెట్టి పొడిగా చేసి సూప్ లలోనూ ఇంకా కారం పొడి లాంటి వివిధ పద్ధతుల్లో ఉపయోగిస్తారు. అంతేకాకుండా మునగవేరు క్రిమిసంహారిగానూ, గనేరియా, సిఫిలిస్ వ్యాధులకు మంచి చికిత్సగా ఉపయోగపడుతుంది. ఆకులు, బెరడు, వంటివి కంటి సమస్యలకు మంచి మందుగా పనిచేస్తుంది. ఇప్పుడు మునగాకుతో అద్భుతమైన చిట్కాలు ఏంటో చూద్దాం.

 Drumstick Leaves amazing benefits do not forget to take them
Drumstick Leaves

కొంతమంది పిల్లలు రాత్రిళ్లు ఎక్కువగా పక్క తడుపుతుంటారు. అలాంటివారికి కప్పుడు మునగాకును కొద్దిగా పెసరపప్పుతో కలిపి కూరగా వండి పెడితే అద్భుత గుణాన్నిస్తుంది. అలాగే తాజా మునగాకు, ఆముదం రెండింటిని కలిపి ఉడికించాలి. ఇలా ఉకిడికించిన మిశ్రమంను ఒక బట్టలో వేసుకుని వాత నొప్పులు, కీళ్ల నొప్పులు, బెణుకు నొప్పులు ఉన్న ప్రాంతాల్లో కాపడం పెడితే ఆ నొప్పులన్ని తొందరగా తగ్గుతాయి.

అంతేకాకుండా గొంతుకు రెండువైపులా వచ్చే గవదబిళ్ళలపై మునగాకు ఉడికించిన మిశ్రమాన్ని చిన్న మూటగా కట్టి గోరువెచ్చగా ఉన్నపుడు పెట్టడం వల్ల గవదబిళ్ళలు తొందరగా తగ్గిపోతాయి. తాజామునగాను రసాన్ని తీసి శుభ్రమైన బట్టలో వడగట్టి ఆ రసాన్ని తేనెతో కలిపి  తాగుతూ ఉంటే గొంతు సమస్యలు, నోటి పుండ్లు, ముఖ్యంగా లివర్ సమస్యలు తొలగిపోతాయి.

మునగాకుల్లో విటమిన్స్, ఎమినోయాసిడ్స్, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. క్యారెట్లు తింటే మాత్రమే వచ్చే విటమిన్ ఎ పది రెట్లు అధికంగా మునగాకు ద్వారా పొందొచ్చు. కళ్ల వ్యాధులకు సంబంధించిన మెడిసిన్ లో మునగాకును వాడతారు. మునగాకుతో లభించే కాల్షియం  పాలలో ఉన్న కాల్షియం తో పోలిస్తే మునగాకులోనే ఎక్కువ ఉంటుంది. గర్భిణులు, బాలింతలకు మునగాకును ఆకుకూరలు మాదిరిగానే కూర వండి పెడితే  వారికి అవసరం అయినా కాల్షియం, ఐరన్, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.

బాలింతలకు పాలు తక్కువైనపుడు మునగాకును రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల పాలు పెరుగుతాయి. గుప్పెడు మునగాకులను వంద మిల్లీలీటర్ల నీటిలో వేసి ఐదు నిమిషాలు ఆ నీటిని కాచి చల్లారనివ్వాలి. చల్లారిన నీటిలో నిమ్మరసం, మిరియాల పొడి, ఉప్పు కలిపి తాగడం ద్వారా శ్వాస సంబంధిత సమస్యలు తగ్గుతాయి. మరి గుప్పెడు మునగాకుల్లో ఇన్ని లాభాలు ఉన్నప్పుడు మీ ఆరోగ్యాన్ని పెంచుకోవడం కోసం మీ ఆహారాల్లో ఒక భాగంగా చేర్చుకోండి.

Bhavanam Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now