Dondakayalu Health Benefits : దొండ‌కాయ‌ల‌ను తింటే ఇన్ని లాభాలు ఉన్నాయా.. తెలుసుకోక‌పోతే న‌ష్ట‌పోతారు..!

October 23, 2023 7:28 AM

Dondakayalu Health Benefits : రెగ్యులర్ గా, మనం దొండకాయలని కూర, ఫ్రై వంటివి చేసుకొని తీసుకుంటూ ఉంటాము. దొండకాయలు మనకి ఈజీగా దొరుకుతుంటాయి. పైగా, చాలా మంది ఇళ్లల్లో దొండకాయలు కాస్తూ ఉంటాయి కూడా. మార్కెట్లో సంవత్సరం పొడుగునా, ఇవి దొరుకుతుంటాయి. కాబట్టి, రెగ్యులర్ గా మనం తీసుకుంటూనే ఉంటాం. దొండకాయని కూర చేసుకోవచ్చు. వేపుడు చేసుకోవచ్చు. లేదంటే, పులుసు కూడా చేసుకోవచ్చు. దొండకాయలో పోషకాలు బానే ఉంటాయి. బీటా కెరోటీన్, అధిక ప్రోటీన్స్, విటమిన్స్, ఖనిజాలు తో పాటుగా ఫైబర్ కూడా దొండకాయలులో ఎక్కువ ఉంటాయి.

దొండకాయని తీసుకోవడం వలన, చాలా సమస్యలకి చెక్ పెట్టవచ్చు. షుగర్ ఉన్న వాళ్ళకి దొండకాయ బాగా పనిచేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలని తగ్గించడానికి, దొండకాయ బాగా ఉపయోగపడుతుంది. షుగర్ వచ్చే సూచనలు కనపడితే కూడా, దొండకాయని ఆహారంలో భాగం చేసుకోండి. అలానే, దొండకాయలని తీసుకోవడం వలన విటమిన్ బి అందుతుంది. ఇది నాడి వ్యవస్థకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆల్జీమర్స్ వంటి సమస్యల బారిన పడకుండా దొండకాయలు చూస్తాయి.

Dondakayalu Health Benefits in telugu
Dondakayalu Health Benefits

దొండకాయని ఎక్కువగా తీసుకుంటే, మందబుద్ధి వస్తుందని అంటారు. కానీ, నిజం కాదు. ఇది కేవలం అపోహ మాత్రమే. మతిమరుపుని తగ్గించడానికి దొండకాయ సహాయపడుతుంది. వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులను కూడా నియంత్రిస్తుంది. దొండకాయలలో యాంటీ బ్యాక్టీరియాల్ గుడాలు కూడా ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్స్ రాకుండా చూస్తాయి. క్యాల్షియం కూడా ఇందులో ఉంటుంది.

మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా ఇది చూస్తుంది. దొండకాయ ఎముక సాంద్రత పెరగడానికి సహాయపడుతుంది. బరువు తగ్గాలని అనుకుంటే, రెగ్యులర్ గా దొండకాయలని తీసుకుంటూ ఉండండి. మంచి ఫలితం ఉంటుంది. శరీరంలో ఐరన్ శాతాన్ని తగ్గితే నీరసం, అలసట, ఎనీమియా వంటి సమస్యలు ఐరన్ తగ్గడం వలన వస్తాయి. కాబట్టి, ఆహారంలో దొండకాయని చేర్చుకోండి. అప్పుడు ఈ సమస్యలు ఏమి ఉండవు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now