Cold And Cough : ఎక్కువగా చలికాలం, వానా కాలంలో అనేక రకాల సమస్యలు వస్తాయి. బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్స్, ఫ్లూ వంటి వాటితో చాలా మంది బాధ పడుతూ ఉంటారు. జలుబు, దగ్గు సమస్య మొదలైందంటే అంత త్వరగా అవి తగ్గవు. కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం వలన జలుబు, దగ్గు ఇంకా ఎక్కువవుతాయి. మరి ఎటువంటి ఆహార పదార్థాలని తీసుకోకూడదనేది తెలుసుకుందాం. జలుబు, దగ్గు సమస్యతో బాధపడే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఆహార పదార్థాలని తినకూడదు.
పాలు ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ జలుబు, దగ్గు ఉన్నప్పుడు పాలను తీసుకోకూడదు. పాలు తాగితే ఛాతిలోని శ్లేష్మం పెరిగిపోతుంది, దగ్గు బాగా ఎక్కువవుతుంది. జలుబు, దగ్గు ఉన్నట్లయితే పాలని అసలు తీసుకోవద్దు. అన్నం తీసుకోకూడదు. అన్నం తీసుకోవడం వలన శ్లేష్మం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. జలుబుతో బాధపడే వాళ్ళు అన్నం తిన్నా కూడా సమస్య తీవ్రమవుతుంది.
దగ్గు, జలుబు ఉన్నట్లయితే షుగర్ ని తీసుకోవద్దు. చక్కెర వలన రోగనిరోధక శక్తి బలహీనమైపోతుంది. దగ్గు, తుమ్ములు ఎక్కువ అవుతాయి. జలుబు, దగ్గు ఉన్నట్లయితే కాఫీ కూడా తీసుకోవద్దు. కెఫిన్ ఇందులో ఎక్కువ ఉండడం వలన గొంతు కండరాలు పొడిబారి పోవడానికి దారితీస్తుంది. దగ్గు ఇంకాస్త ఎక్కువవుతుంది.
కాబట్టి ఇలా కూడా చేయకండి. దగ్గు, జలుబు ఉన్నట్లయితే మద్యం తీసుకోవద్దు. ఆల్కహాల్ ని జలుబు ఉన్నప్పుడు తీసుకోవడం వలన ఇబ్బంది పడాలి. గాయం మానడానికి కారణమయ్యే తెల్ల రక్త కణాలు కూడా దెబ్బతింటాయి. ఇలా అనేక సమస్యలు ఈ ఆహార పదార్థాలను తీసుకోవడం వలన ఎక్కువవుతాయి. కాబట్టి దగ్గు, జలుబు ఉన్నట్లయితే వీటికి దూరంగా ఉండండి. లేదంటే అనవసరంగా మీకే అనేక నష్టాలు కలుగుతాయి. ఎంతగానో ఇబ్బంది పడాల్సి వస్తుంది.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…