Coriander Leaves Lemon Drink : ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజల్లో నేడు అధిక శాతం మంది గుండె జబ్బుల బారిన పడుతున్నారు. వీటికి ప్రధాన కారణమేమిటంటే రక్త నాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవడమే. మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే అదంతా రక్త నాళాల గోడలకు అతుక్కుని అక్కడే ఉండిపోతుంది. దీంతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున కొవ్వు పేరుకు పోయి క్రమేపీ రక్త సరఫరాకు ఆటంకం ఏర్పడి, ఫలితంగా గుండె పోటు వస్తుంది. దీంతోపాటు పలు ఇతర గుండె సంబంధ వ్యాధులు కూడా వస్తాయి.
అయితే నిత్యం వ్యాయామం చేయడం, తగిన పౌష్టికాహారాన్ని వేళ తప్పకుండా తీసుకోవడం, ధూమ పానం, మద్య పానం మానివేయడం, కొవ్వు పదార్థాలను తక్కువగా తినడం వంటి సూచనలు పాటిస్తే ఈ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకుని ఆరోగ్యంగా ఉండవచ్చు. దీంతోపాటుగా కింద ఇచ్చిన ఓ మిశ్రమాన్ని తయారు చేసుకుని దాన్ని కనీసం 2 వారాల పాటు నిత్యం తాగినా శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ వెంటనే కరిగిపోతుంది. దీని వల్ల గుండె ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు. ఆ మిశ్రమాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కొత్తిమీర 3 కట్టలు, 1 కిలో నిమ్మకాయలు, 5 లీటర్ల నీళ్లు, కొద్దిగా బేకింగ్ సోడాను తీసుకోవాలి. ఆర్గానిక్ పద్ధతిలో పండిన నిమ్మకాయలైతే బెటర్. లేదంటే సాధారణ నిమ్మకాయలకు క్రిమి సంహారక మందులు పట్టి ఉంటాయి. కాబట్టి వీటిని తొలగించాలంటే నిమ్మకాయలను బేకింగ్ సోడా, నీరు మిశ్రమంలో వేసి 5 నిమిషాల పాటు బాగా కడగాల్సి ఉంటుంది. అనంతరం నీటిని తీసుకుని బాగా మరిగించి చల్లార్చాలి. కొత్తిమీర, నిమ్మకాయలను తీసుకుని వాటిని చిన్న చిన్న పీస్‌లుగా కట్ చేసుకుని మిక్సీలో వేసి జ్యూస్ పట్టాలి. ఆ జ్యూస్‌ను మరగబెట్టిన నీటికి కలిపి వడపోయాలి. అనంతరం వచ్చే మిశ్రమాన్ని బాటిల్‌లో పోసి నిల్వ చేసుకోవాలి.
ఆ బాటిల్‌ను ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. 24 గంటల తరువాత నుంచి ఆ జ్యూస్‌ను తాగాల్సి ఉంటుంది. నిత్యం 1 గ్లాస్ చొప్పున ఈ జ్యూస్‌ను రోజూ ఉదయాన్నే పరగడుపున తాగాలి. ఇలా కనీసం 2 వారాలు చేయాలి. మొదటి వారంలోనే మీరు ఆశ్చర్యకర ఫలితాలను గమనిస్తారు. పైన చెప్పిన మిశ్రమాన్ని 2 వారాల పాటు తాగితే శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ వెంటనే కరిగిపోతుంది. దీంతో గుండె పదిలంగా ఉంటుంది. రక్త నాళాలు చక్కగా పనిచేస్తాయి. రక్త సరఫరా మెరుగు పడుతుంది. రక్తం శుద్ధి కూడా అవుతుంది. జలుబు, జ్వరం ఉన్న వారు ఈ మిశ్రమాన్ని తాగితే వెంటనే ఆయా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. రక్తంలో ఉన్న విష పదార్థాలు అన్నీ బయటకు వెళ్లిపోతాయి. శరీరంలో ఉన్న అన్ని అవయవాలకు రక్తం ద్వారా ఆక్సిజన్ బాగా సరఫరా అవుతుంది. ఇప్పటికే గుండె సంబంధ సమస్యలు ఉన్నవారు, సమస్యలు రావద్దనుకునే వారు ఈ మిశ్రమాన్ని తాగితే ఫలితం ఉంటుంది.
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్‌లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్‌లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…