ఆరోగ్యం

Cold And Cough : జలుబు, గొంతునొప్పి, జ్వ‌రం వంటి స‌మ‌స్య‌ల‌కు ఎఫెక్టివ్ టిప్స్ ఇవి..!

Cold And Cough : చిన్న చిన్న అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు కూడా ఇంగ్లిష్ మెడిసిన్ ను త‌ర‌చూ వాడ‌డం వల్ల ఎలాంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయో అందరికీ తెలిసిందే. ఆయా మెడిసిన్స్‌ను ఎప్పుడూ వాడుతూ ఉంటే వాటి వ‌ల్ల క‌లిగే సైడ్ ఎఫెక్ట్స్‌తో ఇత‌ర అనేక దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. దీంతో కొండ నాలుక‌కు మందేస్తే ఉన్న నాలుక ఊడింద‌న్న చందంగా మ‌న ప‌రిస్థితి త‌యార‌వుతుంది. అయితే అలా కాకుండా ఉండాలంటే అలాంటి అనారోగ్యాల‌కు ఇంగ్లిష్ మెడిసిన్ కాకుండా స‌హ‌జ సిద్ధ‌మైన ప‌దార్థాల‌తో త‌యారు చేసిన మెడిసిన్‌ను వాడాలి. దీంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండ‌వు. పైగా ఎలాంటి అనారోగ్యాన్న‌యినా ఇట్టే త‌గ్గించుకోవ‌చ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

న‌ల్ల మిరియాలు, దాల్చిన చెక్క‌, జీల‌క‌ర్ర‌, యాల‌కుల‌ను స‌మాన భాగాల్లో తీసుకుని వాటిని క‌లిపి మిక్సీలో పొడిలా ప‌ట్టుకోవాలి. అనంతరం ఆ పొడిని వాస‌న పీలుస్తూ ఉండాలి. ఇలా చేస్తే జ‌లుబు, ముక్కు కార‌డం వంటివి త‌గ్గిపోతాయి. ఒక టేబుల్ స్పూన్ నిమ్మ‌ర‌సం, ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక టీస్పూన్ న‌ల్ల మిరియాల పొడి, ఒక టీస్పూన్ స‌ముద్ర‌పు ఉప్పుల‌ను ఒక గ్లాస్ వేడి నీటిలో బాగా క‌లిపి ఆ నీటిని పుక్కిలిస్తూ ఉండాలి. దీంతో గొంతు స‌మ‌స్య‌లు పోతాయి. ఒక టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ తీసుకుని దాన్ని ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో వేసి బాగా క‌ల‌పాలి. అనంత‌రం ఆ నీటిని ప్ర‌తి భోజ‌నానికి ముందు నోట్లో వేసుకుని బాగా పుక్కిలించాలి. ఇలా చేస్తే నోటిలో పుండ్లు పోతాయి.

Cold And Cough

నిమ్మ‌ర‌సం, న‌ల్ల మిరియాల పొడిని బాగా క‌లిపి మిశ్ర‌మంగా చేసుకోవాలి. దీన్ని ఆలివ్ ఆయిల్‌తో క‌లిపి తింటుంటే గాల్ స్టోన్స్ పోతాయి. దాని వ‌ల్ల వ‌చ్చే నొప్పి కూడా తగ్గుతుంది. 1/4 టీస్పూన్ న‌ల్ల మిరియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల నిమ్మ‌ర‌సం, 1 టేబుల్ స్పూన్‌ తేనెల‌ను ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో బాగా క‌లిపి ఆ నీటిని ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తాగాలి. దీంతో శ‌రీర మెట‌బాలిజం పెరుగుతుంది. ఇది అధిక బ‌రువును ఇట్టే త‌గ్గిస్తుంది. ఏదైనా కార‌ణం వ‌ల్ల ముక్కు నుంచి ర‌క్తం కారుతుంటే అందుకు నిమ్మ‌ర‌సం బాగా ప‌నిచేస్తుంది. ఒక కాట‌న్ బాల్‌ను నిమ్మ‌ర‌సంలో ముంచి దాన్ని ముక్కులో పెట్టుకోవాలి. అయితే అలా చేసే స‌మ‌యంలో త‌ల‌ను కొద్దిగా ముందుకు వంచాలి. దీంతో ముక్కు నుంచి కారే ర‌క్తం ఆగుతుంది.

1/2 టీస్పూన్ న‌ల్ల మిరియాల పొడి, అంతే మోతాదులో ల‌వంగ నూనెలను తీసుకుని బాగా క‌లిపి మిశ్ర‌మంగా చేసుకోవాలి. దీన్ని నొప్పి ఉన్న దంతాల‌పై రాయాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే ఫ‌లితం ఉంటుంది. అయితే ఈ ఔష‌ధం వాడితే కొద్ది రోజుల వ‌ర‌కు చ‌క్కెర‌, దాని స‌హాయంతో చేసిన ప‌దార్థాల‌ను తిన‌కూడ‌దు. న‌ల్ల మిరియాలు కొన్ని, 2 ల‌వంగాలు, 15 తుల‌సి ఆకులు తీసుకుని వాటిని ఒక క‌ప్పు గోరు వెచ్చ‌ని నీటిలో వేసి 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. అనంత‌రం మిశ్ర‌మాన్ని వ‌డ‌క‌ట్టి వ‌చ్చే ద్ర‌వాన్ని జార్‌లోకి తీసుకోవాలి. దాన్ని చ‌ల్లార్చి అందులో కొంత తేనె క‌లుపుకుని తీసుకుంటుంటే ఆస్త‌మా త‌గ్గుతుంది.

ఒక క‌ప్పు మ‌రుగుతున్న నీటిలో ఒక నిమ్మ‌కాయ‌ను పిండి అనంత‌రం ఆ తొక్క‌ను కూడా అందులో వేయాలి. దాన్ని 10 నిమిషాలు ఉంచాక తీసేయాలి. అనంత‌రం ఆ నీటిలో 1 టీస్పూన్ తేనె క‌లిపి తాగాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల జ‌లుబు, ఫ్లూ జ్వ‌రం త‌గ్గుతాయి. క‌డుపు అంతా ఉబ్బ‌రంగా అదోలా ఉండి, వికారంగా ఉంటే న‌ల్ల మిరియాల పొడి, నిమ్మ‌ర‌సంను తీసుకుని వాటిని ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో వేసి బాగా క‌ల‌పాలి. అనంత‌రం ఆ నీటిని కొద్ది కొద్దిగా తాగుతుంటే వికారం త‌గ్గుతుంది. ఇలా చిన్న చిన్న అనారోగ్య స‌మ‌స్య‌లకు ఇంటి చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు. పైగా సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

సీఎస్కేలో ధోనీ నుంచి పాఠాలు నేర్చుకుంటా.. సంజు శాంసన్ ఎమోషనల్ కామెంట్స్!

త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూప‌ర్ కింగ్స్ (CSK) జ‌ట్టు త‌ర‌ఫున ఆడ‌నున్న…

Monday, 16 March 2026, 10:40 PM

సల్మాన్ ఖాన్ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వన్’ టైటిల్ మార్పు.. భాయ్ మూవీ కొత్త పేరు ఏంటంటే?

స‌ల్మాన్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వ‌న్ మూవీ నుంచి ఓ కీల‌క అప్‌డేట్ వ‌చ్చింది. ఈ…

Monday, 16 March 2026, 8:17 PM

రణవీర్ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ ఊచకోత.. విడుదలకు ముందే రూ.60 కోట్లు!

రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…

Monday, 16 March 2026, 3:49 PM

వరల్డ్ కప్ ఫైనల్ బ్యాట్‌ను అక్షయ్‌కు గిఫ్ట్ ఇచ్చిన అభిషేక్ శర్మ.. ఎందుకంటే?

భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…

Sunday, 15 March 2026, 10:44 PM

‘రంగీలా’ పాట చూసి ‘భూత్’ ఆఫర్ ఇచ్చా.. ఊర్మిళా మతోండ్కర్‌పై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన త‌న భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…

Sunday, 15 March 2026, 8:15 PM

ధురంధర్ 2 బాక్సాఫీస్ సునామీ.. విడుదలకు ముందే రూ.32 కోట్ల వసూళ్లు!

భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…

Sunday, 15 March 2026, 4:01 PM

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది.. పవన్ కళ్యాణ్ మాస్ జాతర! శ్రీలీలతో రొమాన్స్ అదిరింది..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…

Sunday, 15 March 2026, 3:04 PM

వింత రనౌట్ వివాదం.. పాక్ ప్లేయర్‌కు ఐసీసీ షాక్! ఆ తప్పు చేసినందుకు భారీ జరిమానా..

బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…

Saturday, 14 March 2026, 10:32 PM