Toothbrush : పొద్దున లేవగానే మనం పళ్లు తోముకుంటాం. కానీ ఎలా తోముకుంటాం. బ్రష్ తీయడం.. పైన పేస్టు పెట్టడం.. నోట్లో పెట్టి నాలుగుసార్లు ఇటూ అటూ పళ్ల మీద రుద్దడం ఇలాగేనా..? ప్రతి వస్తువుకు ఒక ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. అలాగే మనం వాడే టూత్ బ్రష్ కు కూడా. పళ్లు తోముకోవడం గురించి మన టూత్ బ్రష్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోండి. బ్రష్ ను ఎన్ని నెలలకొకసారి మారుస్తున్నారు. ఒక బ్రష్ జీవితకాలం కేవలం రెండు నెలలు లేదా 200 సార్లు వాడడం మాత్రమే. కానీ ఒకే టూత్ బ్రష్ ను కొందరు నెలకు నెలలు వాడేస్తుంటారు. మరికొందరైతే ఏకంగా ఏడాది దాటి మరీ వాడుతుంటారు. కనుక ప్రతి రెండు నెలకు ఒకసారి బ్రష్ ను మారుస్తుండాలి.
రోజూ మీరెంతసేపు బ్రష్ చేస్తారు ? కొందరు పళ్లు అరిగిపోయేలా తోమేస్తుంటారు. మరికొంకదరు అటు ఇటు తోమేసి హడావిడిగా ముగించేస్తారు. కనీసం రెండు నిమిషాలైనా తోమాలని చెబుతున్నారు నిపుణులు. నోరు శుభ్రపడాలంటే రెండు నిమిషాల కన్నా తక్కువ కాకుండా బ్రష్ చేయాలి. బ్రష్ చేసిన వెంటనే నోట్లో నీళ్లు పోసుకుని పుక్కిలించి ఉమ్మేస్తుంటాం. నోరు శుభ్రంగా కడుక్కుని వచ్చేస్తాం. కానీ బ్రష్ చేశాక ఆ నురగ అంతా ఉమ్మేశాక ఓ అరగంట పాటు నీటితో కడగకుండా అలాగే ఉండాలట. అనంతరం నోట్లో నీళ్లు వేసి పుక్కిలించాలట. అరగంట పాటా అని కష్టపడకండీ. మనకు మంచి చేసే ప్రతిదీ కష్టంగానే ఉంటుంది.
బ్రషింగ్ అయ్యాక బ్రష్‌ను బాత్ రూంలో ఒక మూల పడేసి మిగతా పనులు కానిచ్చేస్తుంటారు చాలామంది. కానీ కనిపించని ఎన్నో క్రిములు చేరతాయి. కాబట్టి బ్రష్ ను విడిగా స్టాండ్ లో పెట్టడం అలవాటు చేసుకోవాలి.
హార్డ్ గా ఉండే బ్రిస్సెల్స్ చిగుళ్లను దెబ్బతీస్తాయి. బ్రష్ బ్రిస్సెల్స్ మరీ గట్టిగా ఉన్నవి కాకుండా కాస్త సున్నితంగా ఉన్నవి వాడాలి. ఎక్కువ మంది ఉదయం లేచి బ్రష్ చేశాక మళ్లీ మరుసటి రోజు ఉదయం వరకు దానిని ముట్టుకోరు. అలా కాకుండా మధ్నాహ్నం భోజనం చేశాక, లేదా రాత్రి డిన్నర్ తిన్నాక కూడా బ్రష్ చేస్తే చాలా మంచిది. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి.. మూడు పూటలా అని అనుకునేవారు.. మధ్యాహ్నం కాకపోయినా.. కనీసం రాత్రి మాత్రం కచ్చితంగా పడుకోబోయే ముందు బ్రష్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల దంతాలు, చిగుళ్లు, నోరు శుభ్రంగా ఉంటాయి. దీంతో ఎలాంటి రోగాలు రాకుండా చూసుకోవచ్చు.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…