Coconut Oil To Face : ప్రతి ఒక్కరు కూడా అందమైన చర్మాన్ని, పొందాలనుకుంటారు. అందంగా ఉండాలని అందరికీ ఉంటుంది. అందంగా ఉండడం కోసం, చాలామంది మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ తో సహా ఇంటి చిట్కాలు కూడా పాటిస్తూ ఉంటారు. నిజానికి ఇంటి చిట్కాలు చాలా బాగా పని చేస్తాయి. ఎక్కువ డబ్బులు ఖర్చు చేయకుండానే, మనం మన అందాన్ని ఇంటి చిట్కాలతో పెంపొందించుకోవచ్చు.
కొబ్బరి నూనె తలకి రాసుకోవడం మనకి తెలుసు. కొబ్బరి నూనె వలన చర్మ ప్రయోజనాలు కూడా ఉంటాయి. రాత్రి నిద్రపోవడానికి ముందు, ముఖానికి కొద్దిగా కొబ్బరి నూనె రాసి, రెండు నిమిషాల పాటు మసాజ్ చేస్తే, ముఖంలో తేమ పెరుగుతుంది. ముఖం కాంతివంతంగా మారుతుంది.
ముడతలు కూడా తొలగిపోతాయి. మొటిమలును కూడా కొబ్బరి నూనె తగ్గిస్తుంది. కొబ్బరి నూనెలో కొంచెం కలబంద గుజ్జు వేసుకోండి. అలానే చిటికెడు పసుపు కూడా వేసుకోండి. దీన్ని బాగా మిక్స్ చేసి, ముఖానికి పట్టించి, అరగంట పాటు అలా వదిలేసి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన, ముఖంపై మొటిమలు తగ్గిపోతాయి. బ్యాక్టీరియాని తగ్గించడానికి, మొటిమల్ని, మచ్చల్ని దూరం చేయడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది.
కొబ్బరినూనెలో కొంచెం పంచదార వేసి, ముఖానికి కాసేపు స్క్రబ్ చేసిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తే, ముఖం పై ఉన్న మృత కణాలు తొలగిపోతాయి. చర్మం ప్రకాశవంతంగా మారుతుంది కూడా. నల్లని మచ్చలు కూడా పోతాయి. కొబ్బరి నూనె ని ముఖానికి రాయడం వలన, చర్మం పొడిగా లేకుండా తేమగా ఉంటుంది. చర్మంపై ఉన్న మురికి, దుమ్ము కూడా ఈజీగా తొలగిపోతాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఎక్కువ ఉండటం వలన చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి.
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్‌లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…
సోషల్ మీడియాలో నటి త్రిష గురించి తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో…
నటి త్రిష ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె నటుడు విజయ్‌తో కలిసి ఓ కార్యక్రమానికి జంటగా హాజరైనప్పటి…
ఎట్టకేలకు ఎదురుచూపులకు తెరపడింది. దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించిన అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన భూత్ బంగ్లా ట్రైలర్ విడుదలైంది.…
సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్‌ను తాము పట్టించుకోమని, ఈమధ్య సెలబ్రిటీలను ట్రోల్ చేయడం ఎక్కువైందని, ఆ ట్రోల్స్‌ను పట్టించుకుంటే ముందుకు…