Custard Apple : షుగర్ వున్నవాళ్లు సీతాఫలం తీసుకోవచ్చా..? తీసుకుంటే ఏమైనా సమస్య కలుగుతుందా..?

November 4, 2023 10:24 AM

Custard Apple : చాలామంది, సీతాఫలాలు ఇష్టపడుతూ ఉంటారు. తియ్యగా ఉండే, సీతాఫలాన్ని తీసుకుంటే, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుందట. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. మనం తీసుకునే ఆహారం మీద ఉంది. కచ్చితంగా, కొన్ని విషయాలని పాటించి తినాలి. ఆహారం విషయంలో అసలు అశ్రద్ధ చేయకూడదు. ఎలా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు, ఆహారం దేని వలన పాడవుతుంది, ఇటువంటివి కచ్చితంగా తెలుసుకోవాలి. సీజనల్ ఫ్రూట్స్ ని తీసుకుంటే, ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఎవరైనా సరే ఏఏ కాలంలో వచ్చే పండ్లని, ఆ టైంలో తీసుకుంటే, చక్కటి ఫలితం ఉంటుంది. చలికాలంలో ఎక్కువ సీతాఫలాలు దొరుకుతాయి. షుగర్ పేషెంట్లు తీసుకోవచ్చో లేదో అనే విషయం పై సందేహం ఉంటుంది.

షుగర్ పేషెంట్లు సీతాఫలం తీసుకోవచ్చా..? లేదా అనేది ఇప్పుడు చూద్దాం. డయాబెటిస్ ఉన్న వాళ్ళు, తీసుకునే ఆహారం విషయంలో కచ్చితంగా జాగ్రత్త పాటించాలి. ఎందుకంటే, తీసుకునే ఆహారం కూడా డయాబెటిస్ ఉన్న వాళ్ళలో కీలకమైన పాత్రను పోషిస్తుంది. అందుకే కొన్ని ఆహార పదార్థాలకు డయాబెటిస్ ఉన్నవాళ్లు దూరంగా ఉండాలి. అయితే, కొన్ని పండ్లు తీసుకోవచ్చు ఏం కాదు. సీతాఫలం డయాబెటిస్ ఉన్నట్లయితే, తీసుకోకపోవడమే మంచిది. ఈ పండులో చక్కెర శాతం ఎక్కువ ఉంటుంది.

can diabetics take Custard Apple
Custard Apple

కాబట్టి. ఈ షుగర్ ఉన్న వాళ్ళు అసలు తీసుకోకండి. ఈ పండ్లును తీసుకోవడం వలన షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఒకవేళ కనుక తీసుకోవాలంటే, కొద్దిగా తీసుకోవడం మంచిది. ఎక్కువ మోతాదులో మాత్రం తీసుకోకండి. సీతాఫలాల్లో విటమిన్ ఏ, పొటాషియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి.

ఈ పండును తీసుకుంటే ఆకలితో ఉన్నప్పుడు కడుపు నిండుతుంది. ఈ పండులో ఎక్కువ హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా ఉంటాయి. సీతాఫలం తీసుకుంటే, కంటి చూపు మెరుగు పడుతుంది. మెదడు కూడా, బాగా పనిచేస్తుంది. కాబట్టి, సీతాఫలాన్ని డయాబెటిస్ లేని వాళ్ళు, రెగ్యులర్ గా తీసుకుంటే ఈ ప్రయోజనాలు పొందవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now