Gas Trouble : ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో అనేక రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అనారోగ్య సమస్యల వలన ఆరోగ్యం ప్రమాదంలో పడుతోంది. అయితే మనం మన ఆరోగ్యాన్ని బాగా ఉంచుకోవాలంటే కొన్ని తప్పులు చేయకుండా చూసుకోవడం మంచిది. మన ఆరోగ్యం బాగుండాలంటే ఈ పొరపాట్లని చేయకండి. సాధారణంగా గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. అయితే గ్యాస్ పై నుండి కానీ కింద నుండి కానీ వెళ్ళకుండా ఇబ్బంది కలిగిస్తే దానిని గ్యాస్ ట్రబుల్ అని అంటారు.
పొట్ట టైట్ గా ఉబ్బినట్టుగా ఉన్నట్లయితే అది గ్యాస్ ట్రబుల్ అని చెప్పొచ్చు. పైగా నొప్పి కూడా తీవ్రంగా వస్తూ ఉంటుంది. కింద నుండి పై నుండి గ్యాస్ వెళ్ళిపోవడం అనేది ట్రబుల్ కాదు. ఆగిపోవడం అనేది ట్రబుల్. సాధారణంగా, ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది. అయితే, మోషన్ అవ్వకపోవడం వలన గ్యాస్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. ఈ సమస్య ఉండకుండా ఉండాలంటే, ఉదయం లేవగానే గోరువెచ్చని నీళ్లు తీసుకోవాలి. ఒకటిన్నర లీటర్ల వరకు గోరువెచ్చని నీళ్లు ఉదయాన్నే లేవగానే తీసుకోండి. ఒక్కసారే మీరు నీళ్లని మొత్తం తీసుకోలేకపోతే, ఆగి ఆగి కొంచెం కొంచెం తీసుకుంటూ ఉండండి.
నీళ్లు తాగిన తర్వాత మోషన్ అవ్వాలని ధ్యాస పెట్టాలి. నిద్రలేచిన వెంటనే టీ, కాఫీలు వంటివి తీసుకోవద్దు. కేవలం నీళ్లు తాగి మోషన్ మీద ధ్యాస పెట్టండి. కొంచెం సేపు ధ్యానం చేసుకున్నా పర్వాలేదు. మోషన్ అయిన తర్వాత మళ్లీ లీటరున్నర వరకు నీళ్లు తాగండి. ఒకవేళ కనుక తాగగలిగితే ఇంకా ఎక్కువ నీళ్లు తాగొచ్చు. అప్పుడు మొత్తం పేగుల్లోపల కూడా క్లీన్ అయిపోతుంది.
తినేటప్పుడు బాగా నమిలి తినడం వలన త్వరగా జీర్ణం సరిగ్గా అవుతుంది. ఎల్లప్పుడూ ఏదో ఒక ఆహారం తీసుకోవడం వలన తిన్నది సరిగ్గా జీర్ణం కాదు. కాబట్టి ఇలా తీసుకోవద్దు. టైం టు టైం తీసుకోండి. ఉదయం పూట పండ్లను తీసుకోండి. అలానే ఆహారాన్ని తినేటప్పుడు, నీళ్లు తాగకండి. భోజనం చేసిన రెండు గంటల వరకు నీళ్లు తాగకుండా రెండు గంటల తర్వాత నీళ్లు తీసుకోండి. ఇలా ఈ మార్పులు చేస్తే, కచ్చితంగా గ్యాస్ ట్రబుల్ నుండి బయటపడవచ్చు.
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…
ఆ వ్యాఖ్యతో ముగిసేలా ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…