Arjuna Tree : అర్జున వృక్షం (తెల్లమద్ది) భారతదేశంలో పెరిగే కలప చెట్టు. ఇది ఆయుర్వేదంలో ఔషధంగా విస్తృతంగా ఉపయోగపడుతుంది. ఇది తెలుపు, ఎరుపు రంగుల్లో లభిస్తుంది. ఈ చెట్టు యొక్క శాస్త్రీయ నామం టెర్మినలియ అర్జున. దీని వల్ల కలిగే లాభాలపై కన్నేసిన శాస్త్రవేత్తలు దీనిపై ఇంకా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. గుండెజబ్బుల వారికి, అస్తమా ఉన్నవారికి, ఎముకలు విరిగిన వారికి దీనిని ఔషధంగా ఉపయోగించి వారి వారి రోగాలను నయం చేయవచ్చట. అంతేకాక అర్జున బెరడులో కాల్షియం, అల్యూమినియం, మెగ్నిషియం అధికంగా ఉండడం వల్ల సైంటిఫిక్ గా కూడా ఈ చెట్టు బెరడును చాలా పవర్ ఫుల్ ఔషధంగా అనేక మందుల్లో ఉపయోగిస్తున్నారు.
అర్జున బెరడుని పాలలో కాచి వచ్చిన డికాషన్ ను ఉదయం పూట పరగడుపున తాగితే గుండె జబ్బుల వారికి చాలా మంచిది. ఇది రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండెకు రక్తప్రసరణ సజావుగా సాగేలా చేస్తుంది. అర్జునని ఆస్తమా ఉన్నవారు కూడా ఉపయోగించుకోవచ్చు. బెరడును బాగా మెత్తగా నూరి చూర్ణంగా చేసి పాయసంలో పైన 10 గ్రాములు జల్లి, దానిని తింటే శ్వాస నాళాలను ఎప్పటికప్పుడు శుభ్రపరిచి, ఆస్తమాను తగ్గేలా చేస్తుంది.
అర్జున బెరడు నుంచి తయారుచేసిన చూర్ణంను తేనెతో తీసుకుంటే విరిగిన ఎముకలు త్వరగా అతుక్కుంటాయి. చాలా ప్రఖ్యాతి చెందిన ఆయుర్వేద మందుల్లో ఎముకలను అతికించడానికి దీన్నే ప్రధాన ఔషధంగా ఉపయోగిస్తున్నారు. దీనిలో అధిక మొత్తంలో ఉండే కాల్షియం ఎముకలు త్వరగా అతుక్కునేలా సహాయపడుతుంది. ముఖంపై మొటిమలు ఉన్న అమ్మాయిలు మద్ది చెట్టు బెరడు నుంచి చేసిన చూర్ణాన్ని తేనెలో కలిపి ముఖంపై మొటిమలు వచ్చే చోట రాసుకుంటే త్వరగా తగ్గుతాయి. ఫెయిర్ అండ్ లవ్లీ లాంటి ఫెయిర్ నెస్ క్రీమ్ ల కంటే 3 రెట్ల ప్రభావాన్ని చూపిస్తుంది.
అర్జున బెరడు కషాయాన్ని తాగితే కాలిన గాయాలు, పుండ్లు తగ్గుతాయి. అర్జున బెరడు చూర్ణాన్ని పాలతో కలిపి తీసుకుంటే వీర్య ఉత్పాదక పెరుగుతుంది. దీంతో పురుషుల్లో సంతానం కలిగే అవకాశాలు మెరుగు పడతాయి. అలాగే శృంగార సామర్థ్యం కూడా పెరుగుతుంది. అర్జున చెట్టు బెరడును నూరి గడ్డ ఉన్న చోట కడితే 12 గంటల్లో ఆ గడ్డ క్రమంగా తగ్గిపోతుంది. అంతటి పవర్ అర్జున బెరడుకు ఉంటుంది. కనుక ఈ చెట్టు ఎక్కడ కనిపించినా సరే దీని బెరడును మాత్రం మరిచిపోకుండా ఇంటికి తెచ్చుకోండి. దీంతో అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్‌లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…
తళపతి విజయ్ నటించిన వీడ్కోలు చిత్రం జన నాయగన్ చుట్టూ నెలకొన్న న్యాయపరమైన వివాదానికి ఎట్టకేలకు ముగింపు పడే సూచనలు…
మాతృత్వం ఒక మహిళ జీవితంలో అత్యంత మధురమైన దశగా భావించబడుతుంది. బిడ్డకు జన్మనిచ్చిన ఆనందం ఒక వైపు ఉంటే, మరోవైపు…
మెటాకు చెందిన ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి…
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్…