Anjeer : అంజీర్ పండ్లు మనకు డ్రై ఫ్రూట్స్ రూపంలో, సాధారణ పండ్ల రూపంలోనూ లభిస్తాయి. వీటిని తినేందుకు కొందరు ఇష్టపడరు. కానీ ఈ పండ్లను తినడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఈ పండ్లలో పీచు అధికంగా లభిస్తుంది. అరుగుదలకు మేలు చేస్తుంది. జీర్ణవ్యవస్థ పని తీరును మెరుగు పరుస్తుంది. దీంతో మలబద్దకం తగ్గుతుంది. చిన్నారులకు వీటిని రెండు పూటలా తినిపించడం మంచిది.
2. హైబీపీని అదుపు చేయడానికి అంజీర్‌ను తినాలి. ఇందులో ఉండే పొటాషియం అధిక రక్త పోటును అదుపులో ఉంచుతుంది.
3. మహిళల్లో రక్తహీనత సమస్య ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు రోజూ అంజీర్‌ను తీసుకోవడం మంచిది. ఇందులో హిమోగ్లోబిన్ స్థాయుల్ని పెంచే పోషకాలు అధికంగా ఉంటాయి. దీంతో రక్తహీనత తగ్గుతుంది.
4. బరువు తగ్గాలనుకునేవారు దీన్ని తినాలి. కొన్ని ముక్కల్ని భోజనానికి ముందు తీసుకోవడం వల్ల పొట్ట త్వరగా నిండిపోతుంది. అతిగా తినే సమస్య తగ్గుతుంది. కొలెస్ట్రాల్ సమస్య ఉండదు.
5. హృద్రోగాలతో బాధపడేవారు ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో అంజీర్‌ను చేర్చుకుంటే మేలు. ఇందులో పెక్టిన్ అనే పదార్ధం శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తుంది. గుండెకు మేలుచేస్తుంది.
6. సంతానం కోరుకునేవారు అంజీర్‌ను ఎంత తీసుకుంటే అంత మంచిది. దీనిలో అధికంగా ఉండే మెగ్నీషియం, మాంగనీస్, జింక్ సంతాన సాఫల్యత పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
బాలీవుడ్‌లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్‌లైన్ బుకింగ్‌లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…
తళపతి విజయ్ నటించిన వీడ్కోలు చిత్రం జన నాయగన్ చుట్టూ నెలకొన్న న్యాయపరమైన వివాదానికి ఎట్టకేలకు ముగింపు పడే సూచనలు…
మాతృత్వం ఒక మహిళ జీవితంలో అత్యంత మధురమైన దశగా భావించబడుతుంది. బిడ్డకు జన్మనిచ్చిన ఆనందం ఒక వైపు ఉంటే, మరోవైపు…
మెటాకు చెందిన ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి…