గుడ్డు ఆరోగ్యానికి ఎంతో మంచిది అనే విషయం మనకు తెలిసిందే. అయితే గుడ్డును వివిధ రూపాలలో తీసుకోవడం చూస్తుంటాము. ఈ క్రమంలోనే గుడ్డు ఉడికించి మసాలా గ్రేవీతో తయారు చేసుకుంటే తినడానికి ఎంతో రుచికరంగా ఉండటమే కాకుండా గుడ్డులో ఉన్నటువంటి పోషకాలన్నీ సంపూర్ణంగా మన శరీరానికి అందుతాయి. మరి మసాలా ఎగ్ గ్రేవి ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
*గుడ్లు 6
*కొబ్బరి పొడి రెండు స్పూన్లు
*ధనియాల పొడి టీ స్పూన్
*లవంగాలు 3
*దాల్చిన చెక్క 1
*కొత్తిమీర కొద్దిగా
*అరకప్పు ఉల్లిపాయ ముక్కలు
*వెల్లుల్లి రెబ్బలు పది
*పసుపు చిటికెడు
*ఉప్పు తగినంత
*అల్లం ముక్క
*కారం స్పూన్
*నూనె తగినంత
*పోపు దినుసులు
*నీళ్లు తగినంత
ముందుగా కోడిగుడ్లను ఉడికించుకోవాలి. ఆ తర్వాత మిక్సీ గిన్నెలోకి కొబ్బరి పొడి, ధనియాల పొడి, కోతిమీర, ఉల్లిపాయ, వెల్లుల్లి ముక్కలు, లవంగాలు, దాల్చిన చెక్క, అల్లం ముక్క వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.కోడిగుడ్లు ఉడకగానే నీటుగా పెంకు తీసుకొని మనం అవసరం అనుకుంటే గుడ్లను కట్ చేసుకోవచ్చు లేదా చిన్నగా హోల్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల ఎగ్ లోపల కూడా మసాలా అంటుకొని ఎంతో రుచిగా ఉంటుంది.
స్టవ్ మీద ఒక గిన్నె ఉంచి కొద్దిగా నూనె వేయాలి. నూనె వేడి అయిన తర్వాత పోపు దినుసులు వేయాలి.ఆవాలు చిటపట అనగానే ముందుగా తయారు చేసి పెట్టుకొన్న మసాలా మిశ్రమాన్ని వేసి చిన్న మంటపై బాగా కలియబెట్టాలి. ఈ మసాలా మిశ్రమం లోకి చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, స్పూన్ కారం వేసి బాగా కలియబెట్టాలి. ఒక రెండు నిమిషాలు పాటు మసాలా వేగిన తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. తర్వాత ప్లేట్ వేసి మసాలా మిశ్రమాన్ని బాగా ఉడికించాలి. ఐదు నిమిషాల తర్వాత ఉడుకుతున్న మసాలా మిశ్రమంలోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లు వేసి మరో ఐదు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మసాలా ఎగ్ గ్రేవీ తయారైనట్లే. ఎగ్ గ్రేవీ చపాతీ, రోటి వంటి వాటిలోకి ఎంతో టేస్టీగా ఉంటుంది.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…