ఆమె ఒక‌ప్పుడు రిసెప్ష‌నిస్టు.. క‌ష్ట‌ప‌డి చ‌దివి ఐపీఎస్ అయింది..!

July 10, 2021 10:52 PM

ఏదైనా సాధించాల‌నే ప‌ట్టుద‌ల ఉండాలే గానీ ఎవ‌రైనా ఏ రంగంలోనైనా అద్భుతాలు సాధించ‌వ‌చ్చు. అందుకు స్త్రీలు, పురుషులు, చిన్నా పెద్ద‌, పేద‌, ధ‌నిక అనే భేదాలు ఉండ‌వు. ఎవ‌రైనా ఏది చేసైనా ఉన్న‌త శిఖ‌రాల‌కు చేరుకోవ‌చ్చు. స‌రిగ్గా ఆ మ‌హిళ కూడా అలాగే చేసింది. ఒక‌ప్పుడు రిసెప్ష‌నిస్ట్‌గా ప‌నిచేసింది. కానీ క‌ష్ట‌ప‌డి ఐపీఎస్ ఆఫీస‌ర్ అయ్యింది.

this woman was once receptionist became ips officer

హ‌ర్యానాకు చెందిన పూజా యాద‌వ్ బ‌యో టెక్నాల‌జీ, ఫుడ్ టెక్నాల‌జీల‌లో ఎంటెక్ పూర్తి చేసింది. త‌రువాత కెన‌డా, జ‌ర్మ‌నీలోనూ ప‌నిచేసింది. కానీ ఆమెకు ఎందులోనూ సంతృప్తి ల‌భించ‌లేదు. దీంతో స్వ‌దేశానికి వ‌చ్చి ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌ని అనుకుంది. అందులో భాగంగానే సివిల్స్ రాసింది. ఉత్తీర్ణ‌త సాధించి ఐపీఎస్‌కు ఎంపికైంది. త‌న క‌ల‌ను సాకారం చేసుకుంది.

అలా పూజా యాద‌వ్ క‌ష్ట‌ప‌డి చ‌దివి ఐపీఎస్ ఆఫీస‌ర్ అయింది. 2018లో ఐపీఎస్‌గా నియ‌మాకం అయింది. దీంతో ఆమెను అంద‌రూ అభినందించారు. ఇప్పుడు ఆమె స‌క్సెస్ ఫుల్ ఆఫీస‌ర్ గా సేవ‌లు అందిస్తోంది. ఈ క్ర‌మంలో ఆమె నైపుణ్యానికి, సేవ‌ల‌కు అంద‌రూ ఆమెను ప్ర‌శంసిస్తున్నారు. క‌ష్ట‌ప‌డి చ‌దివి ఐపీఎస్ అయి ప్ర‌జ‌ల‌కు నిజాయితీగా సేవ‌లు అందిస్తున్నందుకు ఆమె అంద‌రి అభినంద‌న‌ల‌ను పొందుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment