VijayaShanti : విజయశాంతి.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఒకప్పుడు టాప్ హీరోలకి పోటీగా నటించి మెప్పించింది. స్టార్ హీరోల సరసన హీరోయిన్‌గా రాణిస్తున్న సమయంలోనే యాక్షన్ సినిమాలతో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది విజయశాంతి. అయితే రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత సినిమాలు చేయడం తగ్గిస్తూ వచ్చారు. 2005 నుంచి సినీ రంగానికి దూరంగా ఉంటూ వచ్చిన విజయశాంతి దాదాపు 15 ఏళ్ల తర్వాత సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో ఆమె రీ ఎంట్రీ ఇచ్చారు.ఆ సినిమాలతో ఆమె నటనకి మంచి ప్రశంసలు దక్కాయి.
విజయశాంతి తెలుగు చిత్రసీమకు లేడీ సూపర్ స్టార్ అని చెప్పాలి. తన యాక్షన్‌తో స్ట్రీట్ ఫైటర్ అవతారమెత్తిన మగరాయుడు. భారత నారిగా తన కర్తవ్యం నెరవెర్చిన పెంకిపెళ్లాం అని చెప్పాలి.. తన నటనతో ఒక హిస్టరిని క్రియేట్ చేసారు. అంతేకాదు యాక్షన్ ఓరియంటెడ్ మూవీస్‌తో లేడీ అమితాబ్‌గా పేరు తెచ్చుకున్నారు. విజయశాంతి పేరు చెబితే తెరపై ఆమె చేసిన పోరాటాలే కాదు. ఆమె ఒలికించిన శృంగారం కూడా గుర్తుకొస్తుంది. అటు ఫర్ఫామెన్స్ ఓరియంటెడ్ మూవీస్‌లో నటిస్తునే.. ఇటు గ్లామర్ డాల్‌గా తన సత్తా చాటి అందరితో శభాష్ అనిపించుకుంది.
అయితే తాజాగా ఆమె సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదాల గురించి చెప్పి ఆశ్చర్యపరచింది. ఓ సినిమా కోసం కదులుతున్న రైలు నుండి పక్క కంపార్ట్మెంట్ కు వెళ్లాలని.. ఆ సమయంలో జస్ట్ మిస్ అయితే కింద పడేదాన్ని అని చెప్పింది. అనంతరం ఓ తమిళ సినిమా షూటింగ్ లో తనను కుర్చీలో బంధించి గుడిసెకు నిప్పు పెట్టే సన్నివేశం ఉండగా, అందులో ఆమెను తాళ్ళతో కట్టేసారట. గుడిసెకు నిప్పు పెట్టినప్పుడు గాలి ఎక్కువ వీయడంతో నిప్పు తన చీరకు అంటుకుందని చెప్పింది. అది చూసి హీరో విజయ్ కాంత్ వెంటనే లోపలికి వచ్చి తనను కాపాడారని… అలా చాలాసార్లు చావు చివరి అంచుల వరకు వెళ్లానని విజయశాంతి స్పష్టం చేసింది.
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడమే కాకుండా, రోజూ కఠిన డైట్, వ్యాయామ నియమాలను పాటించడంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఎల్లప్పుడూ…
అప్పట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌తో కలిసి లక్కీ సినిమా చేసిన సమయంలో చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన తన పట్ల…
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండను ఇటీవలే వివాహం చేసుకున్న కన్నడ నటి రష్మిక మందన్నకుతెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…
హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ డాక్టర్లు తనకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాలని తరచూ…
స్కూల్, కాలేజీల్లో చదివినప్పుడు ఎన్నడూ 80 శాతం మార్కులను దాటలేకపోయానని, కానీ భారత టీ20 జట్టు కెప్టెన్‌గా 80 శాతానికి…
తాను పెళ్లి చేసుకోబోతున్నానని మీడియాతోపాటు సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్న వార్తలను నటి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేరకు…
భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయని, హాలీవుడ్‌లో సినిమాల విషయంలో ఎలాంటి పరిమితులు ఉండవని, అందుకనే అక్కడ…
భారత క్రికెట్ జట్టు రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన బాల్య స్నేహితురాలు వంశికా చద్దాను వివాహం చేసుకున్న నేపథ్యంలో…