Urvasi Rautela : వ‌జ్రాల‌తో పొదిగిన డ్రెస్ ధ‌రించిన అందాల ముద్దుగుమ్మ‌.. ధ‌ర తెలిస్తే నోరెళ్ల‌బెట్టాల్సిందే..!

December 18, 2021 6:20 PM

Urvasi Rautela : బాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వశి రౌతేలా నిత్యం వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటుంది. 2013లో ‘సింగ్ సాబ్ ది గ్రేట్’ సినిమాతో సిల్వర్‌ స్క్రీన్‌పై అడుగుపెట్టిన ఈ అమ్మ‌డు ‘సనమ్‌ రే’, ‘గ్రేట్ గ్రాండ్ మస్తీ’, ‘హేట్ స్టోరీ-4’, ‘పాగల్‌ పంతీ’, ‘వర్జిన్‌ భానుప్రియ’ సినిమాల్లో నటించి మెప్పించింది. త్వరలో ‘బ్లాక్‌ రోజ్‌’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించనుంది.

Urvasi Rautela diamonds dress trendin in social media

ఇటీవల ఇజ్రాయెల్‌ వేదికగా జరిగిన ‘మిస్ ​యూనివర్స్ -2 021’ పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించింది ఊర్వశీ. తద్వారా భారత్‌ ​తరఫున ఈ గ్రాండ్‌ ఈవెంట్‌కు న్యాయనిర్ణేతగా వెళ్లిన అతి పిన్న వయస్కురాలిగా అరుదైన గుర్తింపు దక్కించుకుంది. 2015లో ఇదే మిస్ యూనివర్స్ పోటీల్లో ఇండియా తరఫున తన అదృష్టం పరీక్షించుకున్న ఈ అమ్మడు.. అవే ప్రతిష్ఠాత్మక అందాల పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించడం విశేషం.

పోటీల అనంతరం ముంబై ఎయిర్‌పోర్ట్‌లో దిగిన ఈ ముద్దుగుమ్మ అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది. అందుకు కార‌ణం ఊర్వశి ధరించిన డ్రెస్ ధర సుమారుగా రూ.5 లక్షల వరకు ఉండ‌డం. ఆమె డ్రెస్‌లో డైమండ్‌లు కూడా పొందుపరచి ఉన్నాయి. అలాగే ఆమె ధరించిన చెవి రింగులు కూడా వజ్రాలతో తయారైనవే. కాగా ఇలా వెరైటీ డ్రెస్‌లు, అవుట్‌ఫిట్‌లతో వార్తల్లో నిలవడం ఊర్వశికి మొదటిసారి కాదు. బాలీవుడ్‌లో ఫ్యాషన్‌ దివాగా ఆమెకు పేరుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now