Unstoppable With NBK : బాల‌య్య‌తో మ‌హేష్ బాబు హంగామా.. ఎప్పుడు స్ట్రీమింగ్ కానుందో తెలుసా ?

December 7, 2021 4:39 PM

Unstoppable With NBK : నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్‌గా ప్ర‌ముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆహా యాప్ కోసం అన్‌స్టాప‌బుల్ అనే షోను మొద‌లు పెట్టిన విష‌యం తెలిసిందే. ఈ షో సక్సెస్ ఫుల్‌గా సాగుతోంది. మోహన్ బాబు ఫ్యామిలీ మొదటి ఎపిసోడ్ కి గెస్ట్స్ గా రావడం జరిగింది. డిప్లమాటిక్ ప్రశ్నలు, సమాధానాలతో కాకుండా ఈ ఎపిసోడ్ బోల్డ్ గా సాగింది. ఆ తర్వాత ఎపిసోడ్స్ లో గెస్ట్స్ గా వచ్చిన నాని, బ్రహ్మానందం-అనిల్ రావిపూడి కూడా మంచి ఫన్ పంచారు.

Unstoppable With NBK balakrishna and mahesh babu episode to stream on aha very soon

ఇక నాలుగో ఎపిసోడ్ కోసం మ‌హేష్ బాబు రంగంలోకి దిగారు. రీసెంట్‌గా ఈ ఎపిసోడ్ పూర్తి కాగా, మ‌హేష్.. బాల‌కృష్ణ‌తో షూటింగ్ లో దిగిన పిక్ ను షేర్ చేస్తూ.. “అన్‌స్టాపబుల్ షూటింగ్ సమయంలో ‘అన్‌స్టాపబుల్’గా ఆనందించాను” అంటూ చెప్పుకొచ్చారు. ఈ ఎపిసోడ్‌ ని చూసేందుకు ఇరువురు నటుల అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ ఈ నెల 17న విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ఈ విషయమై ఇంకా అఫిషియల్ ప్రకటన రాలేదు.

ఇదిలా ఉండగా మ‌హేష్ రీసెంట్‌గా జెమినీ టీవీలో ప్రసారం అవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు షోలో ఎన్టీఆర్‌తో క‌లిసి సంద‌డి చేసిన విష‌యం తెలిసిందే. ఇద్ద‌రు నంద‌మూరి హీరోల‌తో సూప‌ర్ స్టార్ చేస్తున్న ర‌చ్చ ఫుల్ క్రేజీగా ఉంద‌నే చెప్పాలి. సీనియర్‌ ఎన్టీఆర్ మరణం తర్వాత కృష్ణ ఫ్యామిలీ నందమూరి కుటుంబంతో సన్నిహితంగా ఉన్న దాఖలాలు లేవు. ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల మధ్య ఆరోగ్యకరమైన వాతావరణం కొనసాగుతుండగా.. ఒకరితో మరొకరు సన్నిహితంగా ఉంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now