వినోదం

టాలీవుడ్‌లో కొత్త రూల్.. 8 వారాల తర్వాతే ఓటీటీలోకి సినిమా..?

ఓటీటీ విడుదల గడువును పెంచే దిశగా తెలుగు సినీ నిర్మాతల యోచన. Photo Credit: Just Dial/The Film Nagar.

కొత్త‌గా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా స‌రే క‌చ్చితంగా 8 వారాల త‌రువాతే ఓటీటీలోకి రావాల‌న్న నిబంధ‌న‌పై ప్ర‌స్తుతం తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో విస్తృతంగా చ‌ర్చ‌లు జ‌రుగుతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ మేర‌కు ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్ అండ్ గిల్డ్ ఓ క‌మిటీని ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ క‌మిటీ ఆ నిర్ణ‌యాన్ని తీసుకుంటే ఇక‌పై రిలీజ్ అయ్యే ఏ తెలుగు సినిమా అయినా స‌రే క‌చ్చితంగా 8 వారాల త‌రువాతే ఓటీటీలోకి రావ‌ల్సి ఉంటుంది. అయితే ఈ ప్ర‌తిపాద‌న ఇప్పుడు కొత్త‌గా వ‌చ్చిందేమీ కాదు. ఎప్ప‌టి నుంచో ఉన్న‌దే. ఎంతోకాలంగా తెలుగు సినీ నిర్మాత‌లు ఇదే విష‌యంపై చ‌ర్చిస్తున్నారు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఈ అంశంపై ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు. అయితే ఇప్పుడు ప్రేక్ష‌కులు ఓటీటీల‌కు బాగా అల‌వాటు ప‌డి థియేట‌ర్ల‌కు రావ‌డం లేద‌ని నిర్మాత‌లు భావిస్తున్నారు. సినిమా రిలీజ్ అయ్యాక 4 వారాల్లోనే ఓటీటీలోకి వ‌స్తుండ‌డంతో ప్రేక్ష‌కులు ఓటీటీలో చూసేందుకు వేచి చూస్తున్నారు త‌ప్ప థియేట‌ర్ల‌కు రావ‌డం లేద‌ని వారు అంచ‌నా వేస్తున్నారు. క‌నుక ఓటీటీలోకి సినిమా వ‌చ్చే వ్య‌వ‌ధిని 8 వారాల‌కు పొడిగించ‌డం ద్వారా అయినా థియేట‌ర్ల‌కు ప్రేక్ష‌కుల‌ను ర‌ప్పించాల‌ని వారు యోచిస్తున్న‌ట్లు స‌మాచారం. అందుక‌నే ఈ నిబంధ‌న తేనున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఇది ప్రాక్టిక‌ల్‌గా సాధ్య‌మ‌వుతుందా..? అని సినీ విశ్లేష‌కులు సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు.

మంచి టాక్ వ‌స్తే ఓకే.. లేక‌పోతే క‌ష్ట‌మే..?

ప్ర‌స్తుతం ఓటీటీ మార్కెట్‌కు డిమాండ్ బాగా పెరిగింది. ప్ర‌జ‌లు ఓటీటీలకు బాగా అల‌వాటు ప‌డ‌డంతో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు కూడా కొత్త సినిమాల‌ను కొనేందుకు పోటీ ప‌డుతున్నాయి. అలాగే సొంతంగా సిరీస్‌లు, సినిమాల‌ను కూడా నిర్మిస్తున్నాయి. ప్రేక్ష‌కుల బేస్‌ను పెంచుకోవ‌డంలో భాగంగానే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు భారీ ధ‌ర‌ల‌కు సైతం కొత్త సినిమాల‌ను కొనుగోలు చేస్తున్నాయి. అయితే ఇటీవ‌లి కాలంలో ఆయా ప్లాట్‌ఫామ్‌లు త‌మ పంథాను మార్చాయి. థియేట‌ర్ల‌లో మంచి టాక్ వచ్చిన సినిమాల‌ను మాత్ర‌మే అధిక ధ‌ర‌ల‌కు కొనేందుకు యోచిస్తున్నాయి. మంచి టాక్ రాక‌పోతే అలాంటి సినిమాల‌కు ఎక్కువ ధ‌ర పెట్టేందుకు ఆయా సంస్థ‌లు ముందుకు రావ‌డం లేదు. మంచి టాక్ వ‌చ్చిన సినిమాలు ఆల‌స్యంగా ఓటీటీలోకి వ‌చ్చినా స‌రే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు అధిక ధ‌ర పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. కానీ సినిమా బాగాలేక‌పోతే దాన్ని ఎంత త్వ‌ర‌గా ఓటీటీలోకి తెచ్చినా ప్లాట్‌ఫామ్‌లు మాత్రం త‌క్కువ ధ‌ర‌నే చెల్లిస్తున్నాయి. ఇది నిర్మాత‌ల‌కు స‌మ‌స్య‌గా మారింది. అయితే ఈ నేప‌థ్యంలో వారు పైన తెలిపిన‌ట్లుగా 8 వారాల నిబంధ‌న అమ‌లు చేస్తే అప్పుడు సినిమా బాగుంటే ఓకే. వారు 8 వారాల త‌రువాత ఓటీటీలో రిలీజ్ చేసినా స‌రే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు సినిమా బాగుంద‌న్న కార‌ణంతో ఆల‌స్యం అయినా ఎక్కువ ధ‌ర పెడ‌తాయి. కానీ సినిమా బాగాలేక‌పోతే మాత్రం ఆల‌స్యం అయ్యే కొద్దీ ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ప్లాట్‌ఫామ్‌లు ఇంకా త‌క్కువ ధ‌ర చెప్పే అవ‌కాశం ఉంటుంది.

సినిమా బాగాలేక‌పోతే ఓటీటీలోనూ నిర్మాత‌కు న‌ష్ట‌మే..?

సాధార‌ణంగా సినిమా బాగుంటే ప్రేక్ష‌కులు ఓటీటీలోకి ఎప్పుడు వ‌చ్చినా చూస్తారు క‌నుక ప్లాట్‌ఫామ్‌ల‌కు ఈ విష‌యంలో న‌ష్టం లేదు. కానీ సినిమా బాగాలేక‌పోతే, దాన్ని మ‌రీ ఆల‌స్యంగా 8 వారాల త‌రువాత రిలీజ్ చేస్తే అప్పుడు ప్రేక్ష‌కులు అలాంటి సినిమాల‌ను దాదాదాపుగా ప‌ట్టించుకోరు. కానీ బాగాలేని సినిమాల‌ను కూడా కాస్త త్వ‌ర‌గా ఓటీటీలోకి తెస్తే అప్పుడు కాస్తో కూస్తో ప్రేక్ష‌కులు ఆ సినిమాను చూసే అవ‌కాశం ఉంటుంది. ఎందుకంటే కొత్త సినిమా అనే కార‌ణంతో. దీని వ‌ల్ల ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల‌కు న‌ష్టం ఉండ‌దు. నిర్మాత‌కు కూడా సినిమా థియేట‌ర్ల‌లో పోయినా ఓటీటీలో రేటు గిట్టుబాటు అవుతుంది. దీంతో న‌ష్టం చాలా వ‌ర‌కు భ‌ర్తీ అవుతుంది. ఇలా ఇప్ప‌టి వ‌ర‌కు చేస్తూ వచ్చారు. అందుక‌నే చాలా వ‌ర‌కు బాగాలేని సినిమాల‌న్నీ చాలా త్వ‌ర‌గా ఓటీటీల‌లోకి వ‌స్తుండ‌డాన్ని ఈ మ‌ధ్య మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. అయితే కొత్త‌గా నిర్మాతలు తేనున్న ఈ 8 వారాల నిబంధ‌న వ‌ల్ల బాగాలేని సినిమాల‌కు న‌ష్టం జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. దీని వ‌ల్ల నిర్మాత‌ల‌కు ఓటీటీలు త‌క్కువ మొత్తం ముట్ట‌జెప్పే అవ‌కాశాలు ఉంటాయి. దీంతో థియేట‌ర్ల‌లో వ‌చ్చే న‌ష్టంతోపాటు ఓటీటీల ద్వారా కూడా నిర్మాత‌కు న‌ష్టం క‌లిగే అవ‌కాశాలు ఉన్నాయ‌ని అంటున్నారు. అందుక‌నే ఎప్ప‌టి నుంచో ఈ 8 వారాల నిబంధ‌న‌పై నిర్మాత‌లు మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నారు. అయితే ఇప్పుడైనా అన్నీ బేరీజు వేసుకుని ఒక నిర్ణ‌యానికి వ‌స్తారా, లేక ఈ నిబంధ‌న‌పై ఎప్ప‌టికీ అలా చ‌ర్చ‌ల‌ను కొన‌సాగిస్తూనే ఉంటారా.. అన్న‌ది వేచి చూస్తే తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

శ్రీలంక ఆటగాళ్లకు ప్రాణగండం? రక్షణ కల్పించాలని కెప్టెన్ శనక వేడుకోలు!

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 టోర్నీ సూప‌ర్ 8 ద‌శ‌లో వ‌రుస‌గా రెండు మ్యాచ్‌ల‌ను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్ర‌మించిన…

Thursday, 26 February 2026, 5:01 PM

క్యాన్సర్ రిస్క్ తగ్గించే 5 ఆహారాలు: డాక్టర్ సౌరభ్ సెథి కీలక సూచనలు!

ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా క్యాన్స‌ర్ కేసులు గ‌ణ‌నీయంగా పెరుగుతున్నాయ‌ని, యుక్త వ‌య‌స్సులో ఉన్న‌వారికి క్యాన్స‌ర్ ఎక్కువ‌గా వ‌స్తుంద‌ని, 5 ర‌కాల…

Thursday, 26 February 2026, 12:01 PM

విజయ్-రష్మిక పెళ్లికి ప్రధాని మోదీ విషెస్.. ఆ లేఖలో ఏముందంటే?

ఈ నెల 26వ తేదీన రాజ‌స్థాన్‌లోని ఉద‌య్‌పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్‌లో వివాహం చేసుకోబోతున్న న‌టీన‌టులు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక…

Wednesday, 25 February 2026, 6:01 PM

వైభవ్ సూర్యవంశీకి టాటా మోటార్స్ బంపర్ గిఫ్ట్.. రూ. 22 లక్షల కారు!

భార‌త అండ‌ర్ 19 క్రికెట్ జ‌ట్టు యువ కెర‌టం వైభ‌వ్ సూర్య‌వంశీకి టాటా మోటార్స్ ఖ‌రీదైన బ‌హుమ‌తిని అంద‌జేసింది. రూ.22…

Wednesday, 25 February 2026, 4:32 PM

సంపాదించడం కాదు.. దాచుకోవడం ముఖ్యం: తమన్నా ఫైనాన్షియల్ టిప్స్!

న‌టీన‌టులు డ‌బ్బు బాగా సంపాదించ‌డం ఒకెత్తు అయితే దాన్ని పొదుపు చేయ‌డం మ‌రో ఎత్తు అని, స‌రైన స‌మ‌యంలో డ‌బ్బును…

Wednesday, 25 February 2026, 1:17 PM

నా భ‌ర్త ఎప్పుడూ నాకు భారం అయ్యేలా ప్ర‌వ‌ర్తించ‌లేదు.. తాప్సీ ఎమోషనల్ కామెంట్స్!

త‌న వైవాహిక జీవితం ప్ర‌స్తుతం ఎంతో సంతోష‌క‌రంగా ఉంద‌ని, భ‌ర్త మ‌థియాస్ బో త‌నకు భారంగా అనిపించేలా ఎప్పుడూ ప్ర‌వ‌ర్తించ‌లేద‌ని…

Tuesday, 24 February 2026, 10:28 PM

అక్షయ్ కుమార్ చెప్పిన ఆ మాటలే నా జీవితాన్ని మార్చేశాయి: మృణాల్ ఠాకూర్

న‌టుడు అక్ష‌య్ కుమార్ గ‌తంలో త‌న‌కు చెప్పిన మాట‌లు ఎంతో ప్రేర‌ణ‌గా నిలిచాయ‌ని న‌టి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఇటీవ‌ల…

Tuesday, 24 February 2026, 9:29 PM

లడ్డూ నెయ్యి కల్తీపై అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ నిప్పులు.. బాధ్యులను వదిలేది లేదు!

తిరుమ‌ల ల‌డ్డూ క‌ల్తీ నెయ్యి ఘ‌ట‌న‌లో బాధ్యుల‌ను క‌ఠినంగా శిక్షించాల్సిందేన‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ డిప్యూటీ సీఎం ప‌వన్ క‌ల్యాణ్ అన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్…

Tuesday, 24 February 2026, 6:05 PM