Telugu OTT : వారం వారం ఓటీటీల్లోకి కొత్త సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఇక ఈ వారం కూడా ఓటీటీలో దాదాపుగా 22 సినిమాలు విడుదల అవనున్నాయి. ఈ క్రమంలోనే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, జీ5, జియో సినిమా తదితర ఓటీటీ యాప్‌లలో డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇక అవేమిటో ఇప్పుడు చూద్దాం. తెలుగు, హిందీ, ఇంగ్లీషు ఇతర భాషల్లో వివిధ జోనర్లలో సినిమాలు ఈ వారం అంటే మే 13 నుంచి 19 వరకు ఓటీటీల్లో స్ట్రీమింగ్‌కు వచ్చి సందడి చేస్తున్నాయి. మరి ఆ సినిమాలు, వెబ్ సిరీసులు ఏంటి, అవి ఏయే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ అవుతున్నాయి అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
క్రాష్ (కొరియన్ వెబ్ సిరీస్) – మే 13
చోరుడు (తెలుగు డబ్బింగ్ చిత్రం) – మే 14
అంకుల్ సంషిక్ (కొరియన్ వెబ్ సిరీస్) – మే 15
బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ (హిందీ యానిమేటెడ్ వెబ్ సిరీస్) – మే 17
ఆష్లే మ్యాడిసన్ : సెక్స్ లైస్ అండ్ స్కాండల్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) – మే 15
బ్లడ్ ఆఫ్ జ్యూష్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) – మే 15
బ్రిడ్జర్టన్ సీజన్ 3 పార్ట్ 1 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) – మే 16
మేడమ్ వెబ్ (ఇంగ్లీష్ మూవీ) – మే 16
పవర్ (ఇంగ్లీష్ చిత్రం) – మే 17
ది 8 షో (కొరియన్ వెబ్ సిరీస్) – మే 17
థెల్మాద యూనికార్న్ (ఇంగ్లీష్ చిత్రం) – మే 17
ఔటర్ రేంజ్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) – మే 16
99 ఇంగ్లీష్ (వెబ్ సిరీస్) – మే 17
బస్తర్: ది నక్సల్ స్టోరీ (హిందీ చిత్రం) – మే 17
తళమై సెయలగమ్ (తమిళ వెబ్ సిరీస్) – మే 17
డిమోన్ స్లేయర్ (జపనీస్ వెబ్ సిరీస్) – మే 13
C.H.U.E.C.O సీజన్ 2 (స్పానిష్ వెబ్ సిరీస్) – మే 14
జర హట్కే జర బచ్కే (హిందీ చిత్రం) – మే 17
గాడ్జిల్లా X కాంగ్: ది న్యూ ఎంపైర్ (తెలుగు డబ్బింగ్ హాలీవుడ్ మూవీ) – బుక్ మై షో ఓటీటీ – మే 13
లంపన్ (మరాఠీ వెబ్ సిరీస్) – సోనీ లివ్ ఓటీటీ – మే 16
ది బిగ్ సిగార్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) – మే 17
ఎల్లా (హిందీ మూవీ) – ఎమ్ఎక్స్ ప్లేయర్ ఓటీటీ – మే 17
ఈ విధంగా ఈ వారంలో మొత్తం సినిమాలు, వెబ్ సిరీస్‌లు అన్నీ కలిపి మొత్తం 22 స్ట్రీమింగ్ కానున్నాయి. ఇక వీటిలో ఎక్కువగా 11 సినిమాలు మే 17 శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అవుతుండగా, వాటిల్లో 7 మాత్రమే సినిమాలు కాగా మిగిలినవి వెబ్ సిరీస్‌లు కావడం విశేషం.
కాగా స్ట్రీమింగ్ అవుతున్న 7 సినిమాల్లో ఆదా శర్మ నటించిన బస్తర్ : ది నక్సల్ స్టోరీ, చోరుడు అనే తెలుగు డబ్బింగ్ మూవీ, హాలీవుడ్ బిగ్గెస్ట్ బజ్ క్రియేట్ చేసిన గాడ్జిల్లా X కాంగ్: ది న్యూ ఎంపైర్, జర హట్కే జర బచ్కే వంటి 4 సినిమాలు స్పెషల్ కానున్నాయి. అదేవిధంగా వెబ్ సిరీసుల్లో బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ ఒక్కటే స్పెషల్‌గా నిలవనుంది.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్‌లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…