Sunil : పుష్ప టీంకి గోల్డ్ బిస్కెట్స్ బ‌హుమ‌తిగా ఇచ్చాడ‌ని చెప్పిన సునీల్..!

December 17, 2021 3:00 PM

Sunil : అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం పుష్ప‌. ఈ మూవీ నేడు గ్రాండ్‌గా విడుదలైంది. గ‌త కొద్ది రోజులుగా  ఈ మూవీకి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. సినిమాకు సంబంధించి అనేక వార్త‌లు కూడా సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఆ మ‌ధ్య పుష్ప టీంకి బ‌న్నీ కాస్ట్‌లీ బ‌హుమ‌తులు ఇచ్చాడ‌ని ప్ర‌చారం జ‌ర‌గ‌గా, తాజా ఇంట‌ర్వ్యూలో సునీల్ స్పందించాడు.

Sunil told that allu arjun given golden biscuits to movie team

పుష్ప టీంకి బ‌న్నీ గోల్డ్ బిస్కెట్స్, గోల్డ్ కాయిన్స్ బ‌హుమతిగా ఇచ్చాడని టాక్స్ వినిపిస్తున్నాయి, ఇది నిజ‌మా అని అడ‌గ‌గా, దానికి సునీల్ అవున‌ని స‌మాధానం చెప్పాడు. అల్లు అర్జున్ అంద‌రికీ గోల్డ్ ఇవ్వ‌డంపై అభిమానులు షాక్ అవుతూ, ఎంత మంచి మ‌న‌సు అంటూ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా నేడు విడుదల అయ్యింది. ముందు నుంచీ ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సుకుమార్‌ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.

ఇక ఈ సినిమాకు సంబంధించిన ఇప్పటికే విడుదలై ట్రైలర్‌ సినీ ప్రేక్షకులకు కట్టి పడేసింది. ఈ సినిమాలోని పాటలకు కూడా ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మరీ ముఖ్యంగా సమంత నటించిన స్పెషల్‌ సాంగ్‌ ‘ఊ అంటావా మామ’ సంచలనం సృష్టించింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now