Spark Movie OTT Streaming : ఓటీటీలో సంద‌డి చేస్తున్న‌ మెహ్రీన్ స్పార్క్.. ఎందులో స్ట్రీమింగ్ అంటే..!

December 13, 2023 7:21 PM

Spark Movie OTT Streaming : విక్రాంత్ హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమా ‘స్పార్క్ లైఫ్’. మెహ‌రీన్, రుక్స‌ర్ థిల్లాన్ హీరోయిన్స్ గా న‌టించిన ఈ చిత్రానికి క‌థ‌ను అందిస్తూ స్క్రీన్ ప్లేను అందించారు విక్రాంత్‌. డెఫ్ ఫ్రాగ్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై లీల ఈ చిత్రాన్ని నిర్మించ‌గా, న‌వంబ‌ర్ 17న ఈ చిత్రం రిలీజ్ అయింది. సినిమా రిలీజ్ అయిన నెల రోజులు కూడా కాలేదు. అప్పుడే ఈ చిత్రం ఓటీటీలోకి వ‌చ్చేసింది. ప్ర‌చారం లేకుండా సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్‌లోకి వ‌చ్చేసింది. తెలుగు, హిందీతో పాటు మిగిలిన ద‌క్షిణాది భాష‌ల్లో స్పార్క్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఓటీటీలో ప్రేక్ష‌కుల‌ని చాలా అల‌రిస్తుంద‌ని విశ్వ‌సిస్తున్నారు మేక‌ర్స్.

చిత్ర క‌థ విష‌యానికి వ‌స్తే.. మెడికోగా ఉన్న జై(విక్రాంత్) కొందరు అమ్మాయిలని ఫాలో చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత వాళ్ళు కాసేపాటికే సైకోలుగా బిహేవ్ చేస్తూ చనిపోతుండ‌డం, ఇలా అనేక హత్యలు జరుగుతుండటం, జైని కొంతమంది అనుమానించడం జరగ‌డం జ‌రుగుతుంది.. ఇదే సమయంలో హీరో.. మెహ్రీన్, రుక్సార్ లతో ప్రేమని నడిపిస్తాడు. పోలీసులకు అనుమానమొచ్చి జైని అరెస్ట్ చేస్తారు. దీంతో జై ఎవరు? అమ్మాయిలు ఎందుకు చనిపోతున్నారు? ఈ హత్యలకు జైకి సంబంధం ఏంటి? అని సాగుతూనే ఉగ్రవాదుల మైండ్ ని ఎలా కంట్రోల్ చేయొచ్చు అనే కొత్త పాయింట్ కూడా కథలో చెప్పారు. వీటన్నిటి గురించి తెలియాలంటే తెరపై స్పార్క్ చూడాల్సిందే.

Spark Movie OTT Streaming know the platform and other details
Spark Movie OTT Streaming

కొత్తవాడైనా విక్రాంత్ రెండు వేరియేషన్స్ తో ప్రేక్ష‌కుల‌ని మెప్పించాడనే చెప్పొచ్చు. రుక్సార్, మెహ్రీన్ తమ అందాలతో పాటలు కొన్ని ఎమోషన్ సీన్స్ లో అలరించారు. సీనియర్ నటి సుహాసిని ఓ కీలక పాత్రలో కనిపించింది. హీరో ఫ్రెండ్ గా సత్య మంచి కామెడీ పండించాడు. పోలీసాఫీసర్ గా బ్రహ్మాజీ, నాజర్, షాయాజీ షిండేలు మెప్పించగా నెగిటివ్ రోల్ లో మలయాళ నటుడు గురు సోమసుందరం అదరగొట్టారనే చెప్పొచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now