Sonal Chauhan : బాబోయ్ బాల‌య్య హీరోయిన్.. మ‌తులు పోగొట్టే అందాల‌తో మెంట‌ల్ ఎక్కిస్తుందిగా..!

December 20, 2021 8:33 PM

Sonal Chauhan : తెలుగు , కన్నడ, తమిళ్, హిందీ భాషల్లో నటిస్తూ తనకంటూ ఒక పేరుని సంపాదించుకునే ప్రయత్నం చేస్తోంది సోనాల్ చౌహాన్. మోడలింగ్ చేస్తూ సినిమాల్లోకి వచ్చిన ఈ ఢిల్లీ భామ హిందీలో జన్నత్ అనే సినిమాలో తొలిసారి నటించింది. ఢిల్లీలో ఫిలాసఫీలో డిగ్రీ చేసిన ఈ ముద్దుగుమ్మ మలేషియాలోని సరావాక్ రాష్ట్రంలో మిస్ వరల్డ్ టూరిజం 2005 గా గుర్తించబడింది. ఆమె మిస్ వరల్డ్ టూరిజంగా ఎన్నుకోబడ్ద మొట్టమొదటి భారతీయురాలు. వీటితోపాటు ప్రముఖ బ్రాండ్స్ కి అంబాసిడర్ గా కూడా పనిచేసింది.

Sonal Chauhan latest photo trending in social media

ఈ హిందీ భామ తెలుగులో మంచి అవకాశాలు కొట్టేసింది. హిందీలో జన్నత్ తర్వాత తెలుగులో వీఎన్ ఆదిత్య దర్శకత్వం వహించిన రెయిన్‌బో సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత లెజెంట్, పండగ చేస్కో, షేర్, సైజ్‌ జీరో, డిక్టేటర్, రూలర్ తదితర సినిమాల్లో నటించింది. ఈ భామ ఒక్క బాలయ్యతోనే మూడు సినిమాల్లో ఆడి పాడటం విశేషం. ఆ తర్వాత టీవీ షోస్ లో స్పెషల్ స్టేజీ పెర్ఫార్మన్స్ లతో అలరిస్తూనే ఉంది.

తాజాగా సోనాల్ చౌహాన్ తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు చలి కాలంలో కూడా చెమటలు పట్టిస్తున్నాయి. బ్లూ డెనిమ్ జీన్స్ మీద స్లీవ్ లెస్ బ్రౌన్ టాప్ తో తన అందాలని ఆరబోస్తూ ఫోజులిచ్చింది. ఇందులో సోనాల్ ఘాటు అందాల‌కు మ‌తులు పోతున్నాయి. ఈమె అందాన్ని వ‌ర్ణించ‌లేక‌పోతున్నామంటూ నెటిజ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now