Shruti Haasan : టాలీవుడ్లో కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. యంగ్ హీరో అడివిశేష్ అక్కినేని వారి ఇంటి అమ్మాయి.. కింగ్ నాగార్జున మేనకోడలు, హీరో సుమంత్ సొదరి సుప్రియని పెళ్లి చేసుకోబోతున్నాడని టాక్ వినిపిస్తుంది. గత కొంత కాలంగా అడివి శేష్, సుప్రియ రిలేషన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. అంతే కాదు వీరు సహజీవనం కూడా చేస్తున్నట్టు వార్తలు వినిపించాయి. ఇండస్ట్రీలో విరిపై రకరకాల పుకార్లు షికారు చేశాయి. అయితే ఎప్పడు ఈ విషయంలో స్పందించలేదు ఇద్దరు స్టార్లు. కాకపోతే మీడియా వీరిపై ఎప్పుడూ కన్నేసి ఉంచింది. ఆమధ్య ఇద్దరు ఈ ఏడాది పెళ్లి చేసుకోబొతుననట్టు వార్తలు గుప్పుమన్నాయి.. కొంత కాలానికి అవి సర్ధుమనిగాయి.
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ కు స్పెషల్ ఇమేజ్ ఉండగా, అతను మంచి కథా బలం ఉన్న సినిమాలు చేసుకుంటూ క్రేజ్ పెంచుకుంటున్నాడు. శేష్.. సుప్రియతో కలిసి గూడాఛారి సినిమా చేయగా, ఇది పెద్ద విజయం సాధించింది. అయితే ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో కింగ్ అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డ అడివి శేష్ హీరోగా ఓ చిత్రం ప్రొడ్యూస్ చేయనున్నారు. చాలా రోజులుగా అన్నపూర్ణ స్టూడియోస్, సెవెన్ ఎకర్స్ స్టూడియోస్, ప్రొడక్షన్ హౌస్ నిర్మాణ నిర్వహణ బాధ్యతలు ఆమె చూసుకుంటున్నారు. సోదరుడు సుమంత్ నటించిన సినిమాలకు ఆమె సమర్పకురాలిగా వ్యవహరించారు. అయితే… పాన్ ఇండియా స్థాయిలో తన పేరు మీద సుప్రియ ఓ సినిమా ప్రొడ్యూస్ చేస్తుండటం ఇదే తొలిసారి. ఈ చిత్రానికి సునీల్ నారంగ్ సహ నిర్మాత.
అడివి శేష్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రంలో శృతి హాసన్ కథానాయిక.ఈ సినిమాకు అమెరికాలో జన్మించిన, అక్కడ పెరిగిన షానియల్ డియో దర్శకత్వం వహిస్తారు. అయితే… తెలుగుకు ఆయన కొత్త కాదు. ఆల్రెడీ అడివి శేష్ ‘క్షణం’, ‘గూఢచారి’ చిత్రాలకు కెమెరా వర్క్ అందించారు. ఇప్పుడీ సినిమాతో సినిమాటోగ్రాఫర్ నుంచి డైరెక్టర్ అవుతున్నారు. ఈ సినిమా టైటిల్ ఏమిటి? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. మరి ఈ చిత్రం ప్రేక్షకులని ఎంతగా అలరిస్తుందనేది చూడాలి.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…